క్రిమియా ప్రాంతంలో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ దేశాల నడుమ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివాదాస్పద ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ వివాదం చెలరేగుతోంది. ఈ క్రమంలో రష్యా అంతర్జాతీయ ఒప్పందాలను కాల రాస్తోందని ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. అమెరికా, ఐరోపా, ఫ్రాన్స్, జర్మనీ, ఫిన్లాండ్, డెన్మార్క్, టర్కీ, ఆస్ట్రియా, బెల్జియం తదితర దేశాలన్నీ రష్యాపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఉక్రెయిన్ పై రష్యా దూకుడు పెరుగున్న వేళ... ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఉక్రెయిన్ సంక్షోభం పై భద్రతా మండలి సమావేశం కావడం ఇది మూడోసారి. 15 దేశాలతో కూడిన భద్రతా మండలి ఇటీవల మూడు సార్లు భేటీ అయింది. రష్యా ప్రత్యక్ష సైనిక ఆక్రమణకు పాల్పడుతోందని... ఈ చర్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్ ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పందించారు. రష్యా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
మిన్ స్క్ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు కలిసి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఇక ఉక్రెయిన్ కు ఐరాస పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉక్రెయిన్ చేపట్టే చర్యలకు మద్దతిస్తామని వెల్లడించారు. రష్యా తీరుపై ఆయన ఆందోళన వెలిబుచ్చారు.
ఉక్రెయిన్ వ్యవహారంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడు ప్రదర్శిస్తున్నారని ఐరాస అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బలప్రయోగం ద్వారా ఏదైనా సాధించవచ్చునని పుతిన్ అనుకుంటున్నారని ఆరోపించారు. పుతిన్ చర్యలు అంతర్జాతీయ వ్యవస్థలకు సవాలుగా మారుతున్నాయని విమర్శించారు.
ఆయనకు గట్టిగా సమాధానం చెప్పాలని ఈ మేరకు అభిప్రాయపడ్డారు. కాగా రష్యా చర్యలను ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తుండగా... చైనా మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. రష్యాకు దగ్గవరుతున్న డ్రాగన్ కంట్రీ... సంక్షోభ నివారణకు పటిష్ట చర్యలు అవసరమంటూ వ్యాఖ్యలు చేసింది.
రష్యా-ఉక్రెయిన్ వివాదం వాస్తవానికి 2014 నాటి ముచ్చట. ఇరు దేశాల సరిహద్దు ప్రాంతమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకుందని... అప్పటి నుంచి అనేక సార్లు ఘర్షణలు చెలరేగుతూ వస్తున్నాయి. అయితే 2020 పరిస్థితి కాస్త కుదుటపడిన... ఈ ఏడాది ఆరంభంలో మళ్లీ కాల్పులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రష్యా బలగాలు మోహరిస్తోంది. కాగా రష్యా దుందుడుకు చర్యలపై ఐరాస భద్రతా మండలి ఆగ్రహం వ్యక్తం చేశాయి. పుతిన్ చర్యలు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి.