ఆంక్షలు తొలగించకుంటే ఐఎస్ఎస్ కూల్చేస్తాం: రష్యా హెచ్చరిక

Update: 2022-03-13 10:55 GMT
యుక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా తాజాగా సంచలన ప్రకటనచేసింది. తమపై అమెరికా, యూరప్ సహా ప్రపంచ దేశాలు విదించిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ ప్రపంచదేశాలను కోరింది. లేకపోతే ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) కూలిపోయే ప్రమాదముందని మరోసారి హెచ్చరించింది. అమెరికా, యూరప్ లే దీనికి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

తాజాగా రష్యాపై ఆంక్షలను ఎత్తివేయాలంటూ రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రోస్ కాస్మోస్’ అధినేత దిమిత్రి రోగోజిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన నాసాతో పాటు కెనడా, ఐరోపా అంతరిక్ష సంస్థలకూ శనివారం లేఖలు రాశారు. ‘ఆంక్షల వల్ల రష్యానుంచి ఐఎస్ఎస్ కు అందే సేవలకు అందే సేవలకు అంతరాయం కలుగుతుంది. పర్యవసానంగా 500 టన్నుల బరువైన ఈ నిర్మాణం సముద్రంలోగానీ , భూమిపైన గానీ కూలిపోయే ప్రమాదం ఉందని రోగోజిన్ హెచ్చరించారు.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా ఇలాంటి బెదిరింపులకు దిగడం ఇది రెండోసారి. ఇక అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ (ఐఎస్ఎస్) అమెరికా, రష్యాలు కంట్రోల్ చేస్తుంటాయి. అంతరిక్ష కేంద్రంలోని రెండు కీలక విభాగాల్లో ఒకదాన్ని  అమెరికా పర్యవేక్షిస్తుండగా.. మరొక విభాగాన్ని రష్యా వ్యోమగాములు పర్యవేక్షిస్తున్నారు.

 ఈ కేంద్రాన్ని  నివాసయోగ్యంగా మార్చే ఇంధన వ్యవస్థలను అమెరికా నిర్వహిస్తుండగా.. నిర్ధేశిత కక్ష్యలో తిరిగే బాధ్యతలను రష్యా చూస్తోంది.  అది నిర్ధేశిత కక్షలో తిరిగేందుకు కావాల్సిన ప్రొపెల్టన్ వ్యవస్థలను రష్యానే అందిస్తుంది. ఐఎస్ఎస్ నియంత్రించేందుకు రష్యా ద్రస్టర్లను పంపుతుంది.

ఒక వేళ రష్యా తన సేవలను నిలిపివేస్తే ఈ కేంద్రం కూలిపోయే ప్రమాదం తలెత్తుతోంది. రష్యా సహాయ నిరాకరణకు దిగితే తమ కంపెనీ రంగంలోకి దిగుతుందని స్పేస్ ఎక్స్ యజమాని అలెన్ మస్క్ హామీ ఇచ్చారు. 
Tags:    

Similar News