పెళ్లి విషయంలో కొన్ని రాజ్యాంగబద్ధమైన నియమాలను మార్చుకుంటోందట రష్య. ప్రపంచంలోనే పెద్ద దేశాల్లో - అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన రష్యా పెళ్లి విషయంలో రాజ్యంగంలో కొన్ని పాత నియమాలను గట్టిగా రాసుకుంటూ ఉంది. అవేమిటంటే.. సెక్స్ కు పెళ్లికి ముడి పెట్టేస్తోంది రష్య. ఒకవైపు ప్రపంచం అభివృద్ధి చెందుతూ.. సెక్స్ ను చిన్న విషయంగా చూసే దశకు చేరింది. ఇండియా వంటి దేశాల్లో కూడా ప్రీ మ్యారిటల్ సెక్స్ ను మరీ తీవ్రమైన నేరంగా చూడటం తగ్గుతూ ఉంది! సినిమాలు - సొసైటీలో.. అవన్నీ కామన్ అయిపోతున్న దశలో ఉంది భారత దేశం.
అయితే రష్యా మాత్రం సెక్స్ కు పెళ్లికి గట్టిగా ముడి పెట్టాలని అనుకుంటోందట. సెక్స్ అంటే అది పూర్తిగా పెళ్లితో నిమిత్తం అయినదని - ఒకరితో సెక్స్ లో పాల్గొంటే వారిని పెళ్లి చేసుకున్నట్టే అని రష్యా నియమం పెట్టుకుంటోందట. ఈ మేరకు అక్కడి రాజ్యాంగంలో ఈ సవరణ చేస్తున్నారట. పెళ్లైతేనే సెక్స్ - సెక్స్ జరిగితే పెళ్లే.. అనే రూల్ చేయడానికి అధ్యక్షుడు పుతిన్ రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
అయితే మనిషి సెక్స్ విషయంలో ఎంత వరకూ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటాడు? అనేది ప్రశ్నార్థకమే. సెక్స్ అనేది మనిషి కనీస అవసరం. సెక్స్ కోసమని పెళ్లి చేసుకోవడం లేదా, సెక్స్ చేసిన వారితో పెళ్లి అయిపోయిందంటే.. సొసైటీ ఆ విషయాలను అంత తేలికగా తీసుకోలేదు. ఇలాంటి నేపథ్యంలో రష్యన్ ప్రభుత్వం చేస్తున్న ఈ నియమం ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందనేది స్పష్టత లేని అంశమే.
అలాగే స్వలింగ సంపర్క వివాహాలను కూడా రష్యాలో నిషేధిస్తూ పుతిన్ నిర్ణయం తీసుకున్నారట. వివాహం అంటే అది స్త్రీ- పురుషుడికి జరిగిదే అని.. మగాడు-మగాడు, స్త్రీ- స్త్రీ పెళ్లి చేసుకుంటామంటే వారిని ఆమోదించేది లేదని పుతిన్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు ఆమోదమే లేకుండా కొత్త చట్టాలను చేస్తున్నారట అక్కడ. ఇప్పటికే చట్టసభల్లో అందుకు ఆమోదం కూడా లభిస్తున్నట్టుగా సమాచారం!