కొన్ని ఉదంతాలు విన్నప్పుడు మనిషితో పోలిస్తే.. మృగం చాలా బెటర్ అన్న భావన కలగటం ఖాయం. కలలో కూడా ఊహించని రీతిలో జరిగే దారుణాలు విన్నప్పుడు మనుషులు ఇంత కిరాతకులుగా ఎలా మారతారన్న సందేహం కలుగుతుంది. రష్యాలో చోటు చేసుకున్న ఒక మోడల్ హత్య ఉదంతం గురించి విన్న వారంతా షాక్ అవుతున్నారు. ఒక హత్య ఇంత భయానకంగా ఉంటుందా? అని భయపడిపోతున్నారు.
సొంతింట్లో.. సొంత మనిషే అత్యంత క్రూరంగా.. కిరాతకంగా చంపిన ఈ వైనం గురించి విన్నప్పుడు.. తాజాగా వెంకటేశ్ నటించిన గురు సినిమా గుర్తుకు వస్తుంది. అసూయతో హీరోయిన్ అక్క.. హీరోయిన్ ను తీవ్ర గాయానికి గురయ్యేలా చేస్తుంది. ఆ క్యారెక్టర్‌కు కోటి రెట్ల అసూయ.. డ్రగ్స్ మత్తు కలిసి.. మనిషిలో ఉండాల్సిన విచక్షణను పూర్తిగా పోయేలా చేసిన వైనం కనిపిస్తుంది.
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ ప్రాంతంలో స్టెఫానియా డుబ్రోవినా బాగా ఫేమస్ మోడల్. ఆమె తన సోదరితో పాటు ఇంట్లో ఉంటున్నారు. హత్య జరిగిన రోజు.. వీరితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. అతగాడు లిక్కర్ కొనుక్కొని రావటానికి వెళ్లిన తర్వాత.. ఇంటి తలుపుల్ని మూసేసిన స్టెఫానియా సోదరి.. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసింది.
140సార్లు కత్తితో పొడిచి.. కనుగుడ్లు బయటకు లాగేసినా ఆమె కోపం చల్లారలేదు. ఆపై చెవులు కోసేసి.. నానా బీభత్సం సృష్టించింది. అనంతరం ఆ మృతదేహానికి జుట్టుదువ్వి.. మేకప్ వేసింది. తన సోదరి మోడల్ గా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకోవటంతో ఈర్షతోనే ఆమె ఈ పని చేసినట్లుగా భావిస్తున్నారు. సొంత సోదరిని దారుణంగా చంపేసిన తీరు తెలిసిన వారంతా నోట మాట రాక షాక్ తింటున్నారు. ఎంత అసూయ అయితే మాత్రం మృగం కంటే దారుణంగానా? అని వ్యాఖ్యానిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/