ప్రపంచ క్రికెట్ సందర్భంగా భారత దిగ్గజ బ్యాటింగ్ త్రయం మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. గంగూలీ - సచిన్ - సెహ్వాగ్ లు నిన్న ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ కు కామెంటరీ చెప్పారు. ఈ సందర్భంగానే మ్యాచ్ మొదలైనప్పుడే క్రిస్ మోరిస్ విసిరిన బంతికి శిఖర్ ధావన్ బ్యాట్ విరిగిపోయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కామెంటరీలో ఉన్న సచిన్ ను ఏడిపించాడు గంగూలీ..
‘శిఖర్ బ్యాట్ కాబట్టి విరిగిపోయిందని.. కానీ సచిన్ మాత్రం భారీ బ్యాట్ లు వాడుతాడని.. చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తుంటాడని.. బ్యాట్ కు ఫెవిక్విక్ పెడుతాడని.. గ్లూ వాడుతాడని.. ఏదీ వాడినా సచిన్ బ్యాట్ మాత్రం విరగదు’ అంటూ గంగూలీ కామెడీ సెటైర్లు వేశాడు. . శిఖర్ బ్యాట్ పలుచగా ఉందని.. సచిన్ బ్యాట్ మాత్రం విరిగిపోదు అంటూ కామెంట్ చేశారు.
ఇక దీనికి పక్కనే ఉన్న సెహ్వాగ్ కూడా సచిన్ బ్యాట్ విరగడం కష్టమేనని వ్యాఖ్యానించాడు. దీంతో అందుకున్న సచిన్ వెంటనే తమ ఫ్లాష్ బ్యాక్ ను చెప్పుకుంటూ గంగూలికి పంచులు విసిరాడు. నేనే కాదు దాదా గంగూలీ కూడా బ్యాట్ తో ఇలాంటి ఆటలే ఆడుతాడంటూ కౌంటర్ ఇచ్చాడు. లార్డ్స్ లో తామిద్దరం ఆడిన తొలి టెస్ట్ లో గంగూలీ ఇలానే చేశాడంటూ కామెడీ పంచాడు.
ఇలా ఇండియా పరుగుల వేటతో కామెంట్రీలో సచిన్ - సెహ్వాగ్ - గంగూలీ లాంటి దిగ్గజాల కామెడీతో ప్రేక్షకులు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను చూస్తున్నారు.