టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్న ఒక నాయకుడు పార్టీ నేతల తీరుకు వ్యతిరేకంగా చెప్పులు కుట్టి నిరసన తెలపడం సంచలనంగా మారింది. పైగా ఆయన ఒక ప్రజాప్రతినిధి. ప్రజలు ఎన్నుకుంటే గ్రామానికి సర్పంచి అయిన వ్యక్తి. అయితే.. దళితుడన్న కారణంతో నేతలు ఆయన్ను చిన్నచూపు చూస్తుండడంతో ఆగ్రహించి నిరసన తెలిపారు.
టీడీపీ నేతలు తనను వేధిస్తున్నారంటూ కృష్ణా జిల్లా కోడిగుడ్డుపాడు సర్పంచ్ భూషణం నిరసనకు దిగారు. మండల సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలోనే బయట భూషణం చెప్పులు కుడుతూ నిరసన తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తాను పార్టీలో ఉన్నానని, మొన్నటి ఎన్నికల్లో సర్పంచ్ గా ఎన్నికయ్యానని చెప్పారు. అయితే తాను దళితుడిని కావడంతో రికార్డులు కూడా అప్పగించడం లేదని ఆయన ఆరోపించారు.
పేరుకు తాను సర్పంచినైనా రికార్డులు ఇవ్వలేదని.. టీడీపీ పెద్దలే అన్నీ చూసుకుంటున్నారని ఆరోపించారు. తనకు వచ్చే గౌరవవేతనాన్ని కూడా పెద్దలే పంచుకున్నారని చెప్పారు. ఇలా ప్రతి విషయంలోనూ గ్రామ పెత్తందార్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/