మోడీకి జై కొట్టిన చిన్నమ్మ భర్త

Update: 2017-01-19 04:51 GMT
పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని అనుకున్నప్పుడు కొంతమంది నాలుక ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది. పరిస్థితులు కాస్త అనుకూలించకపోయినా తెలివైన నాలుక్కి తత్త్వం బోధ పడుతుంది. వెంటనే తప్పును తెలుసుకొని తప్పును సరిదిద్దుకునే పనిలో పడుతుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే చిన్నమ్మ భర్త శశికళ భర్త వ్యవహారం కూడా ఇంచుమించు అదే తీరులో ఉంది. పార్టీలో కాస్త పట్టు చిక్కేటప్పటికి ప్రధాని మోడీని లైట్ తీసుకున్న ఆయన.. చిన్నమ్మకు సినిమా చూపించే దిశగా అమ్మ మేనకోడలు దీప సీన్లోకి రావటంతో ఒక్కసారిగా ఆయన టోన్ మారిపోయింది.

తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తోందంటూ మోడీ సర్కారుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన చిన్నమ్మ భర్త నటరాజ్ తన స్వరాన్ని పూర్తిగా మార్చేశారు. ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి అని వ్యాఖ్యానించటమే కాదు.. తనను అరెస్ట్ చేసినా కూడా మోడీకి జై అని మాత్రమే అంటానని వ్యాఖయానించారు. పార్టీలకు అతీతంగా మోడీ వ్యవహరిస్తున్నారన్న మాటను చెప్పేసిన ఆయన.. మోడీకి ప్రజల సాధకబాధలు తెలుసని చెప్పారు.

మోడీనే కాదు.. అమ్మ మేనకోడలు దీప విషయంలోనూ ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి. అమ్మ సోదరుడి పిల్లలైన దీపిక.. దీపక్ తమ పిల్లలేనని.. దీపనను అదృశ్య శక్తులేవో నడిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే.. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమదేనని చెప్పిన ఆయన.. దీపకు తాము పెద్దోళ్లమన్నట్లుగా మాట్లాడటం గమనార్హం. మరి.. దీప వారి పిల్లలే అయితే.. అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెను ఎందుకు అనుమతించనట్లో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News