న్యూయార్క్‌లోని తన ఇంటికి సమీపంలో జీపులో కూర్చున్న భారత సంతతికి చెందిన వ్యక్తిని కాల్చిచంపారు. శనివారం మధ్యాహ్నం కాల్పులు జరిగిన తరువాత సత్నామ్ సింగ్(31)ను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అతను చనిపోయినట్లు తెలిపారు. ఈ సంఘటన రిచ్‌మండ్ హిల్ పక్కనే ఉన్న సౌత్ ఓజోన్ పార్క్ పరిసరాల్లో జరిగింది.
ఇక్కడ ఏప్రిల్‌లో ఇద్దరు సిక్కు పురుషులపై పోలీసులు ద్వేషపూరిత నేరాలు చేస్తున్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. రెండు ప్రాంతాలలో భారతీయ సంతతికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇక్కడ జరిగిన హత్య విద్వేషంతో జరిగిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సత్నామ్ సింగ్ కాల్పులకు సంబంధించి పోలీసులకు, ప్రత్యక్ష సాక్షుల కథనాలకు మధ్య వ్యత్యాసం ఉందని వార్తలు వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. జీపులో సత్నామ్ సింగ్ కూర్చున్నప్పుడు కాలినడకన వచ్చిన షూటర్ అతనిని కాల్చిచంపాడని తెలిపారు.
అయితే దుండగుడు కారు నుండి కాల్పులు జరిపాడని.. పక్కనే ఇంటి సెక్యూరిటీ కెమెరా ఈ సంఘటనను బంధించిందని పొరుగువారు తెలిపారు. ఆదివారం ఉదయం వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని.. పోలీసుల ప్రకటన వ్యతిరేకంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సత్నామ్ సింగ్ జీప్‌ను స్నేహితుడి నుండి అద్దెకు తీసుకున్నాడని.. సత్నామ్ సింగ్ అనుకొని షూటర్ కాల్పులు జరిపలేదని.. వారి లక్ష్యం వాహనం యజమాని కావచ్చని పోలీసులు తెలిపారు. దాడి చేయాలనుకునే వారు పొరపాటున కాల్చిచంపాడా? అని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏప్రిల్‌లో రిచ్‌మండ్ హిల్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు సిక్కుల తలపాగాలను తీసేసి కొందరు దుండగులు దాడి చేసి దోచుకున్నారు. ఆ దాడులకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి, ద్వేషపూరిత నేరాలకు గాను కేసులు నమోదు చేశారు.