లాభాల యావ తప్పించి మరింకేమీ పట్టని రీతిలోకి వెళ్లిపోతున్నాయి కార్పొరేట్ కంపెనీలు. గతానికి భిన్నంగా ఉద్యోగుల్ని రాచి రంపాన పెడుతూ.. అదనపు పని గంటలు పని చేయిస్తూ లాభాల రుచి మరిగిన తీరుతో ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడితో పాటు పెద్ద ఎత్తున ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అయితే.. మేనేజ్ మెంట్ల డెడ్ లైన్లను అచీవ్ అవుతున్నామా? లేమా? అన్నది తప్పించి.. ఉద్యోగుల వెల్ఫెర్ ను పట్టించుకోని వేళ.. మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు భారీ స్థాయిలో వార్నింగ్ ఇచ్చేశారు.
పెరిగిపోతున్న పని గంటలతో అర్థరాత్రి వరకు మెలుకువతో ఉండటంతోఅనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఈ విషయంలో ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తాజాగా ఆయనో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మైక్రోసాఫ్ట్ టీమ్స్ పై రిమోట్ వర్కు ఎలాంటి ప్రభావాన్ని చూపించిందన్న విషయాన్ని తాము గుర్తించినట్లు చెప్పారు.
వైట్ కాలర్ ఉద్యోగుల్లో మూడొంతుల మంది అర్థరాత్రి వరకు పని చేస్తున్నారన్నారు. ప్రొడక్టివిటీ భోజనానికి ముందు.. తర్వాత పెరుగుతుందన్న ఆయన అర్థరాత్రి వరకు పని చేయటం మాత్రం సమస్యల్ని తీసుకొస్తుందన్నారు. అందుకే సంస్థలు తమ ఉద్యోగుల సమయపాలనను పాటించేలా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేస్తే మొయిల్స్ విషయంలో ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కోరన్నారు. సమయపాలన లేకుండా సాగే పని వల్ల వ్యక్తిగత జీవితాలు విచ్ఛిన్నం అవుతాయన్నారు.
తమ సంస్థ ప్రొడక్టివిటీలో ముఖ్యమైన భాగంలో ఉద్యోగుల శ్రేయస్సు కూడా భాగమన్న ఆయన.. ఒత్తిడి ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడిని చూపిస్తుందని.. అదెలాంటి ప్రబావాన్ని చూపిస్తుందన్న విషయాన్ని ఆయన వివరించారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉద్యోగులు పాతకాలం పద్దతుల్ని పాటించాలన్న ఆయన.. వృత్తి జీవితం ఆరోగ్యం మీద ప్రభావితం చూడకుండా చూసుకోవాలన్నారు.
సత్యనాదెళ్ల చెప్పిన ఈ మాటలు ఆయన ఉద్యోగులకే మాత్రమే కాదు.. ప్రపంచంలోని చాలా టెక్ కంపెనీలకు.. వాటి సీఈవోలకు అవసరం. ప్రొడక్టివిటీని టార్గెట్లను అఛీవ్ కావటం పైనే తప్పించి.. మరింకే రీతిలో చూడని కంపెనీలు బాగుపడినా.. అందులో పని చేసే ఉద్యోగులు మాత్రం ఆరోగ్య పరంగా దెబ్బ తింటారని మాత్రం చెప్పక తప్పదు.