అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పలు నూతన సంస్కరణలు తీసుకువస్తోంది. ఇప్పటికే పలు విద్యా సంస్కరణలు అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల యూనిఫాం కలర్ మార్చనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది నుంచి 6వ తరగతి నుంచి 10 తరగతి విద్యార్థుల యూనిఫాం కలర్ మార్చనున్నట్లు ఏపీ విద్యా శాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు తెలుపు - నీలం - ముదురు నీలం రంగుల బట్టలు ఇస్తుండగా గులాబీ రంగు దుస్తులు ఇవ్వనున్నట్లు తెలిపింది. బాలురకు ప్యాంట్ - షర్ట్ - బాలికలకు పంజాబీ డ్రెస్ ఇస్తామని - బట్టను ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని తెలిపింది. అలాగే కుట్టుకూలి బ్యాంకులో డబ్బులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని ఏపీ విద్యా శాఖ 2020, -ఏప్రిల్ 27వ తేదీ సోమవారం వెల్లడించింది.
ఏపీలో కరోనా వ్యాపిస్తున్న సమయంలో ఒకవైపు కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే .. మరోవైపు ఇతర కార్యక్రమాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు - నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు తయారు కావాలని సీఎం జగన్ సంకల్పించారు. పాఠశాలలను ఆధునీకరించాలని, సదుపాయాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతోనే ఇప్పుడు నాడు, నేడు కార్యక్రమం చేపడుతున్నారు.