పదిరెట్లు ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్!

Update: 2020-08-17 17:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ లో భయానక మార్పులు కలవరపెడుతున్నాయి. మలేషియా దేశంలో కరోనా కేసుల్లో కొత్త మార్పులు ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇప్పటికే కరోనాపై వ్యాక్సిన్ తయారు చేస్తున్న శాస్త్రవేత్తలకు మలేషియాలో బయటపడిన మార్పులు షాకింగ్ గా మారాయి.

మలేషియాలో కరోనా వైరస్ కొత్తజాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందేలా వైరస్ మార్పునకు గురైనట్లు తేలిందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ హెచ్చరించాడు.

ఫిలిప్పీన్స్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తులలో మలేషియాలో ఈ కొత్త జాతి వైరస్ ఉన్నట్టు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఈ జాతి మరింత తీవ్రమైన వ్యాధికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్లు ఈ కొత్త జాతి వైరస్ ఏమాత్రం ప్రభావం చూపవని అంటున్నారు. మలేషియాలో కొత్త కరోనా జాతి వెలుగులోకి రావడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News