గంగూలీ -వార్న‌ర్‌ లను సెహ్వాగ్ ఎలా ఆట‌ప‌ట్టించాడంటే

Update: 2017-06-06 15:56 GMT
ఇండియా మాజీ ఓపెన‌ర్‌ - స్టార్ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ మైదానంలో చెల‌రేగిపోయిన‌ట్లే...సోష‌ల్ మీడియాలోనూ త‌న ప్ర‌తాపం చూపెడుతుంటారు. సంద‌ర్భం ఏదైనా దాన్ని ట్విస్ట్ చేసి చ‌మ‌త్కారం జోడించి చెప్ప‌డంలో సెహ్వాగ్ ముందుంటారు. ఒక్కోసారి సెహ్వాగ్ ట్వీట్లు చూస్తే ఇంత స్పాంటెనియిటీ ఎలా వ‌చ్చింద‌నే డౌట్ రాక‌మాన‌దు. అలాంటి చిలిపి పనుల‌నే తాజాగా ప్ర‌ముఖ క్రికెటర్లు వార్న‌ర్‌ - సెహ్వాగ్‌ ల‌పై చేసి ట్వీట్ల‌తో హాస్యం పండించారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించి పాకిస్తాన్‌-ఇండియా మ్యాచ్ సంద‌ర్భంగా వ‌ర్షం కురియ‌డంతో ప‌లు సంద‌ర్భాల్లో అవాంత‌రం త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటుగా గంగూలీ -వార్న‌ర్‌ లు వ్యాఖ్యాత‌లుగా వ్యవ‌హ‌రించారు. అయితే వాన కార‌ణంగా బ్రేక్ రావ‌డంతో గంగూలీ, వార్న‌ర్‌లు మ‌ధ్య‌లో ఓ కునుకు తీశారు. అక్క‌డే ఉన్న సోఫాల‌పై నిద్ర‌లోకి జారుకున్నారు. ఈ సీన్‌ ల‌ను ఫొటోలో బంధించిన సెహ్వాగ్ వాటిని ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేసేశాడు. అంతేకాకుండా దానికి కామెంట్లు జోడిస్తూ....అస్సలు సమయాన్ని వృథా చేయకుండా నిద్రపోతుండ‌టం వ‌ల్లే  లెజెండ్స్ అయ్యారు అంటూ చమత్కరించాడు. జీవితం ఎప్పుడూ కలలోనే రూపాంతరం చెందుతుందంటే ఇదేనేమో! అంటూ జోకులు పేల్చారు.

ఈ ట్వీట్‌ ల‌ను చూసిన వార్న‌ర్ ఒక‌టే న‌వ్వులు న‌వ్వుకున్నాడు. వ‌ర్షంతో బ్రేక్ వ‌స్తే...ఆ స‌మ‌యంలో ఇలా త‌ల‌వాలిస్తే.... ఫోటో తీసి ప్ర‌పంచానికి పంచిపెడ‌తావా వీరు అంటూ సెటైర్లు వేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News