పాక్ తో సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకోవడం.. ఉగ్రవాదులతో భారత్ పోరు జరుపుతుండడంతో దేశవ్యాప్తంగా ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. కొందరు మోడీ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ యుద్ధం విషయంలో మోడీ డైరెక్ట్ గా స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు తమ సొంత దేశాన్నే విమర్శిస్తున్నారు.. ఇది మన ముందున్న సవాల్.. ఇలాంటివాళ్ల వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది.. ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగా సాయుధ బలగాలకు అండగా నిలవాలి' అని ప్రధాని మోడి ప్రతిపక్షాలను కోరారు.. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో ప్రధాని మోడి మాట్లాడారు. ఉగ్రవాద దాడులకు భయపడేది లేదని, వారిపై సరైన విధంగానే చర్యలు తీసుకుంటామన్నారు.
అలాగే రాఫెల్ యుద్ధవిమానాలు ఉంటే భారత్ పరిస్థితి వేరే రకంగా ఉండేదని ప్రజలు కోరుతున్నారని ప్రధాని సంచలన కామెంట్స్ చేశారు.. దేశమంతా ముక్తకంఠంతో రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే బాగుండునని అంటున్నారన్నారు. అవి లేకపోవడం లోటేనని.. అందుకే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం బాధాకరమన్నారు. అయినా మనదగ్గరున్న వనరులతో శత్రువులను తిప్పికొడుతామన్నారు.
రాఫెల్ యుద్ధ విమానాలపై ఇప్పుడు జరుగుతున్న చర్చల వల్ల అది లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని మోడీ అన్నారు.. చర్చలకు బదులు విమానాల కొనుగోలుకు సహకరిస్తే యుద్ధం సులభమయ్యేదన్నారు. ఆ తరహా విమానాలు మన దగ్గర లేకపోవడం పెద్ద లోటన్నారు. రాఫెల్ విమానాలపై యావత్ దేశం బాధపడుతోందన్నారు.