ఆ నియోజ‌క‌వ‌ర్గం సెంటిమెంటును ఫాలో అవుతున్న పార్టీలు..ఏపీలో ఇదో వింత‌!!

Update: 2022-12-15 17:30 GMT
రాజ‌కీయాల్లో పార్టీల‌కు, నేత‌ల‌కు కూడా సెంటిమెంటు ఎక్కువ‌గానే ఉంటుంది. దీనిని ఎవ‌రూ తోసిపుచ్చ లేరు. నామినేష‌న్ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌చారం వ‌ర‌కు కూడా పార్టీలు, నాయ‌కులు.. సెంటిమెంటుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సెంటిమెంటును చూస్తే.. నిజ‌మే అని కూడా అనిపిస్తుంటుంది. ఏపీలో మ‌రోచిత్ర‌మైన సెంటిమెంటు కూడా ఉంది. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాద‌నే వాదన ఉంది.

స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో ఓడిపోయిన పార్టీ అధికార చేప‌డుతుంద‌ని కూడా నేత‌ల మ‌ధ్య సెంటిమెంటును పెంచేసింది. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గం మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది. అదే ఉమ్మ‌డి అనంత‌పు రం జిల్లాలోని ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం.

ఇక్క‌డ నుంచి ఏ పార్టీ త‌ర‌ఫునైనా ఒక అభ్య‌ర్థి విజ‌యం దక్కించుకుంటే.. ఆ పార్టీ అధికారం కోల్పోతుంద‌నే వాద‌న బ‌లంగా ఉంది. అదేస‌మ‌యంలో ఇక్క‌డ ఓడిపోయిన అభ్య‌ర్థి తాలూకు పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నే న‌మ్మ‌క‌మూ ఉంది.

కొన్ని ద‌శాబ్దాలుగా ఇదే జ‌రుగుతోంది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది.  ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ నాయ‌కుడు ప‌య్యావుల కేశ‌వ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఈ య‌న గెలిచారు. అయితే, టీడీపీ అధికారం కోల్పోయింది. 2014లోఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌పున విశ్వేశ్వ‌ర‌రెడ్డి గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని ఆశ‌లు పెట్టుకున్న వైసీపీకి అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం ఎదురైంది.

దీంతో ఈ ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం పేరు చెబితేనే.. పార్టీలు హ‌డ‌లిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. బ‌హుశ ఈ ఉద్దేశంతోనే ఏమో.. వైసీపీ ఇక్క‌డ పార్టీలో న‌నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించ‌డం లేద‌నే వాద‌న ఉంది.

మ‌రోవైపు..  టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుడు ప‌య్యావుల కావ‌డంతో ఆయ‌న‌ను మార్చుకునే అవ‌కాశం లేదు. గెలుపు ఓట‌ములు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ నియోజ‌క‌వ‌ర్గంపై మాత్రం పార్టీలు ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం మ‌రోచిత్రం. మ‌రి వ‌చ్చే ఎన్నికల్లో ఇక్క‌డ ఎవరు నెగ్గుతారో చూడాలి.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News