పోలీసులకు కోపం వస్తుంది. అంతే.. గ్యాంగస్టర్ల మీదా.. సంఘ విద్రోహక శక్తుల్ని అదే పనిగా ఏరేస్తుంటారు. కనిపించినోడ్ని కనిపించినట్లుగా కాల్చేస్తుంటారు. దెబ్బకు నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తటమే కాదు.. బయటకు రావాలంటేనే వణికిపోతారు. పూర్తిగా అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోతారు. ఇలాంటి సీన్లు సినిమాల్లో మాత్రమే సాధ్యం. రియల్ లైఫ్ లో ఇలాంటివెక్కడ జరుగుతాయని తరచూ అనుకుంటూ ఉంటాం.
అయితే.. ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు అచ్చం రీల్ లో మాదిరి రియల్ గా సినిమా చూపించేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో యూపీలో చోటు చేసుకున్న పరిణామాలతో షాక్ తింటున్నారు. యూపీలోని వివిధ ప్రాంతాల్లో గడిచిన ఒక రోజు వ్యవధిలో ఏకంగా ఏడు ఎన్ కౌంటర్లు చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. ఈ ఏడు ఎన్ కౌంటర్లలో ఏడుగురు క్రిమినల్స్ ను అదుపులోకి తీసుకోవటం.. ఆ వెంటనే వారు పారిపోవటం.. వారిని పట్టుకునే ప్రయత్నంలో విఫలయత్నానికి గురైన పోలీసులు.. వారిని కాల్చి పారేయటం.
ఎన్నో సినిమాల్లో కనిపించిన సీన్.. ఇప్పుడు మాత్రం రియల్ గా ఆవిష్కృతమవుతోంది. ఈ ఉదంతం ఇప్పుడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్ కౌంటర్లు జరిగిన ఏడింటిలో మూడు ఘజియాబాద్ లోనే చోటు చేసుకోవటం గమనార్హం. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లలో బైకు మీద వెళుతున్న ఇద్దరు నేరస్తుల్ని పట్టుకునే క్రమంలో కాల్పులు జరపగా.. పోలీస్ యూనిఫాం ధరించిన ఒక నేరస్తుడు చనిపోగా.. గాయపడిన మరొకరు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. ఏమైనా.. ఇలా వరుస పెట్టి 24 గంటల వ్యవధిలో ఇన్నేసి ఎన్ కౌంటర్లు చోటు చేసుకోవటం సంచలనంగా మారింది.