బాంబే హైకోర్టు ఆసక్తికర తీర్పును ఇచ్చింది. ఇటీవల కాలంలో రేప్ కేసులు పెరగటం.. పనిలో పనిగా కొన్ని దొంగ కేసులు కూడా నమోదు కావటం తెలిసిందే. ఇద్దరు యువతీయువకుల మధ్య రిలేషన్.. తర్వాతి కాలంలో వారు అనుకున్నట్లుగా సాగకుంటే.. తమను రేప్ చేశారని.. కొన్ని నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా ఫిర్యాదులు చేయటం కనిపిస్తుంది.
కొన్ని సందర్భాల్లో అయితే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న వారు సైతం.. ఈ తరహా ఆరోపణలు చేస్తున్న వైనం ఈ మధ్యన బయటకు వస్తున్నాయి. ఈ తరహా ఉదంతాలకు చెక్ చెప్పేలా తాజాగా బాంబే హైకోర్టు ఆసక్తికర తీర్పును వెల్లడించింది.
గాఢమైన ప్రేమలో మునిగిన ఇద్దరు ప్రేమికులు పరస్పర ఆమోదంతో సెక్స్ సంబంధాలు పెట్టుకోవటాన్ని రేప్ కిందకు పరిగణించలేమని పేర్కొంది. గోవాకు చెందిన చెఫ్ యోగేష్ పాలేకర్.. తన కో ఎంప్లాయి అయిన ఒక మహిళతో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటామని చెప్పి యోగేష్ తన ఇంట్లో వారిని పరిచయం చేయటానికి ఇంటికి తీసుకెళ్లాడు.
వారు వెళ్లే సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవటంతో.. యోగేష్ ఇంట్లోనే ఆయన లవ్వర్ బస చేశారు.
ఆ రాత్రి వేళ యోగేష్ తన ప్రేయసితో మూడుసార్లు సెక్స్ చేశారు. అనంతరం ఆమెను వారింట్లో వదిలేశాడు. అనంతరం తక్కువ కులమని రిజెక్ట్ చేశాడు.
దీనిపై యోగేష్ పై ఫిర్యాదు చేయగా.. కోర్టు అతనికి ఏడేళ్ల జైలుశిక్ష.. రూ.10వేల జరిమానాను విధించారు. దీనిపై బాంబే హైకోర్టుకు అప్పీలుకు వెళ్లగా.. తామిద్దరం ప్రేమికులమని.. ఆమెకు తాను ఆర్థికంగా సాయం చేశానని.. ఈ నేపథ్యంలో పరస్పర ఆమోదంతో లైంగిక చర్యలకు పాల్పడ్డామని యోగేశ్ బాంబే హైకోర్టులో వాదించాడు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు.. ప్రేమికులు పరస్పర అంగీకారంతో శృంగారం చేస్తే అది రేప్ కిందకు రాదంటూ కేసును కొట్టేసింది.