షబానా ఆజ్మీ పంచ్ అదిరిపోయిందిగా

Update: 2016-03-18 16:30 GMT
మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మజ్లిస్ అధినేత.. ఆయన పరివారానికి చెందిన కొందరు నేతలు మినహా.. మిగిలిన వారంతా అసద్ ను తిట్టిపోసేవారే. భారత మాతాకీ జై అనమంటే తాను అననని.. తన గొంతు మీద కత్తి పెట్టినా ససేమిరా అంటూ మాటలతో తెగబడిన వైనం ఇప్పటికే సంచలనంగా మారి.. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.

అసద్ వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ రియాక్ట్ అవుతూ.. అసద్ భారత్ మాతాకీ జై అనటం ఇబ్బంది అయితే.. ‘‘భారత్ అమ్మీకి జై’’ అనే మాట అనటానికి ఎలాంటి అభ్యంతరం లేదుకదా అంటూ ప్రశ్నించారు? భారత్ మాతాలో ‘‘మాతా’’ అన్న పదమే అభ్యంతరం అయితే.. ‘‘అమ్మీ’’ అని పిలిచేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటూ ఆమె వేసిన వ్యాఖ్యల్ని అసద్ వింటే.. ఎలా రియాక్ట్ అవుతారో..?
Tags:    

Similar News