నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తారనే ఊహాగానాలను ఆ పార్టీ వాళ్లు ఖండిస్తూ ఉన్నారు. ఎన్సీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే ఆలోచన లేదని ఆ పార్టీ వాళ్లు చెబుతూ ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ –ఎన్సీపీలు కలిసే పోటీ చేశాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ ఐదు ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. అక్కడ బీజేపీ-శివసేన ల హవా మరోసారి కొనసాగిన నేపథ్యంలో కాంగ్రెస్-ఎన్సీపీల కూటమికి ఎదురుదెబ్బ తగిలింది.
ఇలాంటి నేపథ్యంలో వరసగా ఎదురుదెబ్బలు తగిలిన తరునంలో కాంగ్రెస్-ఎన్సీపీలు ఏకం అవుతాయనే ప్రచారం ఒకటి సాగుతూ ఉంది. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షహోదా కావాలంటే.. మూడు ఎంపీ సీట్లు కావాలి. ఎన్సీపీ వద్ద ఐదు ఎంపీ సీట్లున్నాయి. ఇప్పుడు గనుక ఎన్సీపీ వెళ్లి కాంగ్రెస్ లోకి విలీనం అయితే కాంగ్రెస్ ఎంపీ సీట్ల సంఖ్య యాభై ఏడుకు పెరుగుతుంది.
అప్పుడు కాంగ్రెస్ కు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఈ ఆశతోనే రాహుల్ గాంధీ ఇటీవల శరద్ పవార్ తో సమావేశం అయినట్టుగా వార్తలు వచ్చాయి. రాహుల్- పవార్ ల మధ్యన విలీన చర్చ జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే ఎన్సీపీ వాళ్లు మాత్రం విలీనం ఆలోచనే లేదని చెబుతూ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎన్సీపీ ఏర్పడింది. సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పుడు పవార్ తో సహా అనేక మంది తిరుగుబాటు చేశారు. వారంతా ఎన్సీపీని ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తూ వచ్చారు. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే ఎన్సీపీ కొంత ఉనికిని చాటుకుంటూవస్తోంది.
అయితే సోనియాను వ్యతిరేకిస్తూ ఏర్పడిన ఈ పార్టీ యూపీఏలో భాగంగా ఆమె నాయకత్వంలోనే పని చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విలీన ప్రతిపాదన వచ్చినట్టుగా ఉంది. అయితే ఎన్సీపీ వాళ్లు మాత్రం నో అంటున్నట్టున్నారు.