రాజకీయాల్లో తిట్టుకోవటం కామన్. కానీ.. పొగుడుకోవటం ఆన్ కామన్. రాజకీయనాయకులు.. అందులోకి పరస్పర వైరుధ్యం ఉన్న పార్టీ నేతలు ఇద్దరు ఒకే వేదిక మీద కలిసినప్పుడు వారు.. ఒకరి గురించి మరొకరు పొగుడుకోవాలంటే ఎలా ఉంటుందనటానికి మహారాష్ట్రంలో తాజాగా జరిగిన కార్యక్రమమే నిదర్శనం. ప్రముఖ నేతలిద్దరూ ఒకరినొకరు విపరీతంగా పొగుడుకోవటంతో.. కార్యక్రమానికి హాజరైన వారి నోటి వెంట మాట రాని పరిస్థితి.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్ రావు దేశ్ ముఖ్ విగ్రహాన్ని లాతూర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పంకజా ముండే.. శరద్ పవార్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. సినిమాల్లో దిలీప్ కుమార్ ఎలాంటి వారో.. రాజకీయాల్లో శరద్ పవార్ అలాంటి వారేనని.. పవార్ కు ఏదైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే.. పొలిటికల్ దిలీప్ కుమార్ అంటూ బిరుదు ఇవ్వాలంటూ ఆయన మైమరిచిపోయేలా పొగిడేశారు.
అనంతరం మాట్లాడిన శరద్ పవార్.. మంత్రి పంకజా ముండేను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంకజా ముండేను దీపికా పదుకునేతో పోల్చారు. బాలీవుడ్ లో దీపికా పదుకునే మాదిరే.. రాజకీయాల్లో పంకజా ముండే దీపికా పదుకునే లాంటి వారంటూ పొగిడేశారు. తనకు ఈ తరం సినిమా నటుల గురించి తెలీదని.. విలాస్ రావు దేశ్ ముఖ్ కుమారుడు.. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ను ఇప్పటి తారల్లో పాపులర్ ఎవరని అడిగితే దీపికా పదుకునే అని చెప్పారని.. అందుకే పంకజా ముండేను దీపికాతో పోల్చినట్లుగా వివరించారు. మొత్తానికి ఈ పొగడ్తల దెబ్బకు.. అక్కడున్న వారి నోట మాట రాలేదంట.