ఆర్ధిక మాంద్యం.. పెరిగిన వడ్డీ రేట్లు.. ద్రవ్యోల్బణం.. ఆర్ధిక వ్యవస్థలో మందగమనం వల్ల భారతీయ స్టాక్ మార్కెట్ గత సెషన్ ల్లో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. నేడు కూడా అదే ఒడిదొడుకుల మద్య స్టాక్ మార్కెట్ ట్రెడ్ అవుతూ ప్రారంభం అయ్యింది.
ఉదయం 228.50 పాయింట్లు క్షీణించి 54166.02 వద్ద సెన్సెక్స్ ట్రేడ్ అవ్వగా... 80.65 పాయింట్లు క్షీణించి 16135.35 పాయింట్ల వద్ద నిఫ్టీ ట్రేడ్ అయ్యింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మొదటి క్వార్టర్లీ ఫలితాలు మార్కెట్ పై ప్రభావం చూపించాయి. అంతే కాకుండా రూపాయి కూడా స్థిరత్వం లేకుండా బలహీనపడటం వల్ల కూడా మార్కెట్ పై తీవ్రమైన ప్రభావం కనిపించింది. విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్ లు ఈక్విటీలను విక్రయించడం ద్వారా భారత స్టాక్ మార్కెట్ లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
ప్రముఖ కంపెనీలకు చెందిన షేర్ లు స్వల్పంగా లాభం దక్కించుకున్నా మెజార్టీ షేర్లు మార్కెట్ ఒడిదొడుకుల నేపథ్యంలో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
రూపాయి డాలర్ మారకపు రేటులో తేడాల వల్ల కూడా మార్కెట్ ల యొక్క పతకంకు కారణం అయ్యి ఉండవచ్చు అనే అభిప్రాయం ను మార్కెట్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ మార్కెట్ పరిస్థితిని బట్టి దేశీయ స్టాక్ మార్కెట్ ఉంటుంది. పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కూడా స్టాక్ మార్కెట్ పై ఒత్తిడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మాంద్యం తో పాటు పలు కారణాల వల్ల భారత షేర్ మార్కెట్ నేల చూపులు చూస్తుంది.