పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేసీఆర్ సర్కారు మీద నిప్పులు చెరుగుతున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేయటం తెలిసిందే. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆమె చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ శనివారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పోలీసులు ఒక్కసారిగా వేదికను చుట్టుముట్టి ఆమె దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా ఆమెను ఆసుపత్రికి తరలించారు.
కేసీఆర్ సర్కారు తీరును నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న షర్మిల ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తుండటం ఆందోళనకు గురి చేసింది. వైద్యులు సైతం ఆమె తక్షణమే ఆహారం తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. అయినప్పటికీ.. షర్మిల మాత్రం తన పట్టును విడవలేదు. ఆరోగ్యం దెబ్బ తింటున్నా.. ఆ విషయాన్ని లెక్క చేయలేదు. ప్రభుత్వ తీరును తప్పు పడుతూ తాను చేపట్టిన దీక్షను కొనసాగించటానికే మొగ్గు చూపారు.
ఆమె కనుక ఆదివారం కూడా దీక్షను కొనసాగిస్తే.. ఆమె ఆరోగ్యం ప్రమాదకరంగా మారుతుందన్న అంచనాల్ని వైద్యులు వెల్లడించటంతో పోలీసులు అలెర్టు అయ్యారు. శనివారం రాత్రి పది గంటల వరకు చడి చప్పుడు చేయని పోలీసులు అర్థరాత్రి పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దీక్ష స్థలి వద్దకు రావటం.. కాసేపటికే ఆమెను అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసేసి.. సరిగ్గా ఒంటి గంట పది నిమిషాల సమయంలో ఆమెను అక్కడి నుంచి బలవంతంగా అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను సంకెళ్లు వేస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వకపోవటాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు. మరో వైపు తమ పార్టీ నాయకుల్ని అరెస్టు చేసిన పోలీసులు విడుదల చేయకుండా పాత కేసుల్ని తవ్వి రిమాండ్ కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె మండిపడ్డారు.
మంత్రి సత్యవతి రాథోడ్ ఏ రోజుమహిళల గురించి నోరు విప్పింది లేదని.. కానీ తనను మాత్రం దూషించారన్న ఆమె.. "సత్యవతి రాథోడ్ విచక్షణకే వదిలేస్తున్నా. పార్టీ కార్యాలయం చుట్టూ కర్ఫ్యూ ఎత్తి వేసి.. మా పార్టీ నేతల్ని విడుదల చేసే వరకు దీక్షను ఆపేది లేదు" అని షర్మిల పేర్కొన్నా.. అందరి అంచనాలకు తగ్గట్లే అర్థరాత్రి వేళలో ఆమెను బలవంతంగా అపోలోకు తరలించి వైద్యం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.