భారతీయ జనతా పార్టీని ఇటీవలే ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన అలనాటి స్టార్ హీరో - షాట్ గన్ శత్రుఘ్న సిన్హా ఆ పార్టీ తరఫున పోటీకి రెడీ అయ్యారు. పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి షాట్ గన్ పోటీ చేయబోతూ ఉన్నారు. ఇది వరకూ బీజేపీ తరఫున ఎంపీగా వరస విజయాలు సాధించిన శత్రుఘ్న తొలి సారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతూ ఉన్నారు.
తన సొంత సామాజికవర్గం కాయస్తాలు అధికంగా ఉన్న నియోజకవర్గం నుంచినే ఈ బాలీవుడ్ హీరో పోటీ చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ఈయనపై బీజేపీ తరఫు నుంచి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పోటీ చేయబోతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో షాట్ గన్ మాట్లాడుతూ..తన విజయం మీద పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. తన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పుకొచ్చారు. తమ నియోజకవర్గం ఓటర్లు బీజేపీకి బుద్ధి చెబుతారని అన్నారు.
ఇక 'వారణాసి నుంచి పోటీ చేయబోతున్న నరేంద్రమోడీ.. రెండో నామినేషన్ ను పట్నా సాహిబ్ నుంచి వేయబోతున్నారట కదా..' అనే రూమర్ ను ఈ హీరో వద్ద ప్రస్తావిస్తే.. మోడీ పోటీని స్వాగతించారు. తనకు కూడా మోడీని ఢీ కొట్టాలనే ఉందని అన్నారు. మోడీ వచ్చి తన పై పోటీ చేయాలని తను కోరుకుంటున్నట్టుగా ఈ సినిమా హీరో కమ్ సీనియర్ పొలిటీషియన్ చెప్పారు. మరి మోడీతో ఢీ కొట్టడానికి అంత ఉత్సాహం ఉంటే.. ఎంచక్కా ఈయనే వెళ్లి వారణాసి నుంచి పోటీ చేయొచ్చుగా.. అనే కామెంట్లూ వినిపిస్తున్నాయనుకోండి!