సొంతింట్లోనే మోడీకి ‘ శ‌త్రు’వు

Update: 2016-11-24 11:22 GMT
విప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ధాని మోడీకి సొంత పార్టీలోనే నిర‌స‌న గ‌ళం వినిపిస్తోంది. చాలాకాలంగా మోడీని అనేక అంశాల్లో విమ‌ర్శిస్తున్న బీజేపీ ఎంపీ శ‌త్రుఘ్న సిన్హా తాజాగా పాత పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపైనా మండిప‌డ్డారు. తాజాగా ఆయ‌న మోడీ చెప్పిన స‌ర్వే ఫ‌లితాల‌నూ త‌ప్పుప‌ట్టారు. ఆ స‌ర్వేలన్నీ బూట‌క‌మ‌న్న‌ట్లుగా ఆయ‌న ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశారు.

అస‌మ్మ‌తి ఎంపీగా ఇప్ప‌టికే ముద్ర‌ప‌డిన శత్రుఘ్న సిన్హా తాజాగా మోడీపై గ‌ట్టి విమ‌ర్శ‌లే చేశారు. భ్ర‌మ‌ల్లో బతకొద్దని ప్రధాని మోడీకి పరోక్షంగా సూచించారు. నోట్ల రద్దుకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారన్న ప్ర‌ధాని వ్యాఖ్యలను ఆయ‌న తప్పుబట్టారు. ‘ పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోండి. కట్టుకథలు - స్వప్రయోజనాల కోసం నిర్వహించిన సర్వేలకు దూరంగా ఉండండి’ అంటూ ఆయ‌న ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు.

నోట్ల ర‌ద్దుపై మొబైల్‌ యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలో 93 శాతం మంది పెద్దనోట్ల రద్దుకు మద్దతిచ్చారని, కేవలం 2 శాతం మంది మాత్రమే దాన్ని వ్యతిరేకించారన్నారని ప్రధాని మోడీ వెల్ల‌డించ‌డాన్ని ఆయ‌న ఆక్షేపించారు. మోడీ సర్కారు తమకు అనుకూలంగా ఈ సర్వే చేయించుకుందన్న ప్రతిపక్షాల ఆరోప‌ణ‌ల‌కు ఆయ‌న ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప‌లికారు.  మ‌రోవైపు విప‌క్షాలు కూడా గ్రామీణ భారతానికి ఈ సర్వేలో చోటివ్వ‌లేద‌ని అంటున్నాయి. గ్రామాల్లో చాలా మందికి స్మార్ట్‌ ఫోన్లు లేవని.. ఆ కార‌ణంగా వారి అభిప్రాయాలు వెల్ల‌డికాలేదంటున్నాయి. అంతేకాకుండా ఈ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా వ‌చ్చిన అభిప్రాయాల‌ను కూడా తొల‌గించార‌ని ఆరోపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News