బీజేపీకి షాకిస్తున్న షాట్‌ గ‌న్‌

Update: 2015-08-05 11:03 GMT
మోడీ ప‌ట్టు త‌గ్గుతుందా?  సొంత పార్టీ నేత‌ల్ని సైతం ఆయ‌న కంట్రోల్‌ లో పెట్ట‌లేక‌పోతున్నారా అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. గ‌తంలో వ‌రుస వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఉక్కిరిబిక్క‌రి చేస్తూ.. విప‌క్షాల‌కు స‌రికొత్త ఆయుధాలు ఇచ్చే క‌మ‌ల‌నాథుల్ని కంట్రోల్ లో పెట్టేందుకు కిందామీదా ప‌డి.. చివ‌ర‌కు ఒక సిస్టంలోకి తీసుకురావ‌టం తెలిసిందే.

మ‌రోవైపు.. పార్టీ నేత‌లే కాదు.. ప‌క్క పార్టీ నేత‌ల్ని ఒక తాటి మీద‌కు తీసుకొచ్చి.. అధికార‌ప‌క్షం పై విరుచుకుప‌డేలా చేయ‌టంలో కాంగ్రెస్ అధినేత్రి స‌క్సెస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. సొంత పార్టీ నేత‌ల మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్ట‌టంలో మోడీ విఫ‌ల‌మ‌వుతున్నార‌న‌టానికి నిద‌ర్శ‌నంగా తాజాగా ఒక నిర‌స‌న గ‌ళం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

పాతిక‌మంది కాంగ్రెస్ ఎంపీల‌ను ఐదు ప‌ని దినాల‌కు స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌టంపై కాంగ్రెస్‌తో స‌హా కొన్ని విప‌క్షాలు విరుచుకుప‌డ‌టం తెలిసిందే. కేంద్ర స‌ర్కారు తీరుకు నిర‌స‌న‌గా వారు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ నేత‌.. షాట్ గ‌న్ గా సుప‌రిచితుడైన బాలీవుడ్ న‌టుడు శ‌త్రుఘ్న సిన్హా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు మోడీ స‌ర్కారుకు ఇబ్బందిగా మారాయి.

కాంగ్రెస్ ఎంపీల స‌స్పెన్ష‌న్ పై షాట్ గ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత‌లు స‌స్పెన్ష‌న్ బాధాక‌ర‌మ‌ని.. పాతిమందిని స‌స్పెండ్ చేస్తే వారిలో ఒక‌రు స‌భ‌కు హాజ‌రు కాని నేత కూడా ఉన్నారంటూ కొత్త పాయింట్‌ను బ‌య‌ట‌పెట్టారు.

బీహార్ రాజ‌ధాని పాట్నా ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న శ‌త్రుఘ్న సిన్హా.. సొంత పార్టీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు సంధిస్తూ.. జేడీయూకి చెందిన బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ ను పొగ‌డ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి.. పార్టీ ప్ర‌తిష్ట‌కు భంగం వాటిల్లేలా వ్య‌వ‌హ‌రిస్తున్న శ‌త్రుఘ్న సిన్హాపై మోడీ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు బీజేపీలో చ‌ర్చ‌గా మారింది.
Tags:    

Similar News