ప్రత్యేక హోదా పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న నటుడు శివాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మండిపడ్డాడు. బాబు ప్రభుత్వంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో శివాజీ నిప్పులు చెరిగాడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగువాళ్లంటే కేంద్రానికి గౌరవం.. భయం ఉండేవని.. అవి ఇప్పుడు పోయాయని శివాజీ అన్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రాన్ని శాసించే వారని కానీ ఇప్పుడు బాబు ప్రభుత్వంలో తెలుగువారికి విలువే లేకుండా పోయిందని శివాజీ వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం బాబు హయాంలో రాష్ట్రంలో మద్యం తప్ప ఇంకేమీ దొరకట్లేదని శివాజీ అన్నాడు. ప్రభుత్వం మద్యం అమ్మకాలతో 20 వేల కోట్లు ఆర్జిస్తోందని చెప్పాడు. ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని.. కానీ అవినీతి మాత్రం ఎన్నడూ లేని స్థాయిలో మితి మీరిందని ఆరోపించాడు. తన సవాలును స్వీకరిస్తే ఈ విషయాన్ని నిరూపిస్తానన్నాడు. చాలా గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలవరానికి కేంద్రం వంద శాతం నిధులిచ్చిందా అని ప్రశ్నించిన శివాజీ.. బాబు వస్తే జాబు వస్తుందన్నారని.. కానీ ఎవరికి వచ్చిందో చెప్పాలని.. బాబు కొడుక్కి మాత్రమే మంత్రి పదవి వచ్చిందని శివాజీ అన్నాడు.
రుణ మాఫీ చేస్తామన్న హామీని టీడీపీ సర్కారు నెరవేర్చలేదని.. వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా.. అంబాని.. అదాని లాంటి వాళ్లకు మాత్రమే రుణ మాఫీ వర్తించిందని.. ఇలాంటి వాళ్లకు ఎన్డీఏ ప్రభుత్వం 50 వేల కోట్ల దాకా రుణ మాఫీ చేసిందని శివాజీ ఎద్దేవా చేశాడు. భాజపా సర్కారు నెహ్రూ కన్నా మోడీనే గొప్ప అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తోందన్నాడు. చంద్రబాబు.. వెంకయ్యలకు సమస్యలే ప్రధానం అన్నట్లు.. వాటిని పరిష్కరించడానికే కష్టపడుతున్నట్లు కలరింగ్ ఇస్తారని.. కానీ అదంతా డ్రామా అని శివాజీ అన్నాడు. యూపీ ఎన్నికల్లో కులం కీలక పాత్ర పోషించిందన్న శివాజీ.. ఏపీలో కుల రాజకీయాలు మరింత తీవ్రంగా ఉన్నాయన్నాడు. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేలా చేయడమే తన మిషన్ అని శివాజీ చెప్పడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/