డబ్బు - హోదా - అధికారం - బలం - బలగం - తెలివి తేటలు ఎన్ని ఉన్నా కూడా సంతోషం లేకపోతే ఆ మనిషి జీవితం వృథాయే. అది గుర్తించే మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలను సంతోషంగా ఉంచడానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొన్న ప్రకటన కూడా చేశారు.
ప్రజలంతా సంతోషంగా ఉండాలని... సంతోష సూచిలో ముందు నిలవాలని తాపత్రయ పడుతున్న బుల్లి దేశంలో భూటాన్ ను ఆదర్శంగా తీసుకుని తాము కూడా సంతోషానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చౌహాన్ చెబుతున్నారు.
మధ్యప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్న సంతోషం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యోగా శిబిరాలు - ధ్యాన కార్యక్రమాలు - సాంస్కృతిక కార్యక్రమాలు - ఇతర పోటీలు నిర్వహిస్తూ ప్రజలను ఉల్లాస పరచడం లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. దీనికోసం అక్కడ వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రతిపాదన చేయబోతున్నారు. మరి ఆర్థిక శాఖ - రెవెన్యూ శాఖ... ఇలా వివిధ శాఖలకు మంత్రులున్నట్లే కొత్తగా రానున్న సంతోషం శాఖకు మంత్రయ్యి సంతోషకర జీవితం ఎవరికి దక్కుతుందో చూడాలి.