సానియా భర్త రిటైర్మెంట్..ఎట్టకేలకూ!

Update: 2019-07-06 05:22 GMT
ఎప్పుడో ఇరవై యేళ్ల కిందటే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడటం మొదలు పెట్టిన షోయాబ్ మాలిక్ ఎట్టకేలకూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇరవై యేళ్ల సుదీర్ఘ వన్డే కెరీర్ నుంచి వైదొలుగుతున్నట్టుగా మాలిక్ ప్రకటించాడు. అంతర్జాతీయ వన్డేల నుంచి తను రిటైర్ అవుతున్నట్టుగా సానియా మీర్జా  భర్త ప్రకటించాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో కూడా పాక్ జట్టులో సభ్యుడు షోయబ్ మాలిక్. అయితే ఈ ప్రపంచకప్ లో అతడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అవకాశం వచ్చింది మూడు మ్యాచ్ లలో. వాటిల్లో రెండు మ్యాచ్ లలో డక్ ఔట్ అయ్యాడు. ఒక మ్యాచ్ లో ఎనిమిది పరుగులు చేశాడు.

ఇండియాతో మ్యాచ్ లో తొలి బంతికే ఔట్ అయ్యాడు మాలిక్. మ్యాచ్ కు ముందు రోజు సానియా - ఇతర పాక్ ఆటగాళ్లతో కలిసి ఇతడు డిన్నర్లకు వెళ్లాడనే విమర్శలు వచ్చాయి. అయితే అది ఎప్పటితో పాత ఫొటో అనే వార్తలూ వచ్చాయి. మొత్తంగా మూడు మ్యాచ్ లలో అవకాశం వస్తే వాటిల్లో రాణించలేకపోయాడు మాలిక్. ప్రపంచకప్  నుంచి పాక్ కూడా నిష్క్రమించింది. దీంతో మాలిక్ రిటైర్మెంట్ ను అనౌన్స్ చేసినట్టున్నాడు.

గత ఇరవై యేళ్లలో రెండు వందల ఎనభై ఏడు వన్డేలు ఆడిన ఈ పాకిస్తానీ ఆల్ రౌండర్ దాదాపు ఏడు వేల ఐదు వందల పరుగులు చేసి, నూటా యాభై ఎనిమిది వికెట్లను తీశాడు. పలు వివాదాల్లో చిక్కుకుని నిషేధాలు కూడా కొన్నేళ్ల పాటు ఎదుర్కొని మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు  మాలిక్.
Tags:    

Similar News