అమెరికాలో షాకింగ్ ఫ్రాడ్.. భారతీయుడే నేరస్థుడు

Update: 2022-10-20 04:44 GMT
అమెరికాలో ప్రవాస భారతీయుడు షాకింగ్ మోసానికి పాల్పడ్డాడు. వర్జీనియాలోని ఫ్రెడెరిక్స్‌బర్గ్ నివాసి అయిన ఇతడు ఆన్ లైన్ లో ఇతరుల ఖాతాల్లోంచి డబ్బులను చోరీ చేసే మోసానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు.

నిందితుడు రిషి బుధదేవ్(37)గా గుర్తించాడు. అతను విచారణలో భారతదేశానికి చెందిన పేరులేని కుట్రదారులతో కలిసి ఈ మోసాలకి పాల్పడినట్టు సమాచారం.  

2015 అక్టోబరులో తనకు తెలియని అనేక మంది వ్యక్తుల నుంచి మనీగ్రామ్ ద్వారా మోసపూరిత  నగదు బదిలీలను తస్కరించినట్టు బుధదేవ్ అంగీకరించాడు.

తనకు తెలియని వ్యక్తి నుండి తన ఖాతాలో $9000 మోసపూరిత డిపాజిట్‌ను స్వీకరించినట్లు తెలిపారు.

భారతదేశంలో ఉన్న సహ-కుట్రదారు అభ్యర్థన మేరకు తాను చేసిన నగదు బదిలీలను స్వీకరించినట్లు బుధదేవ్ పోలీసుల ఎదుట నిజం ఒప్పుకున్నాడు. అతను మనీగ్రామ్ డబ్బు బదిలీలను ఐఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఉపయోగించానని, ఫిబ్రవరి 2016లో అదే సహ-కుట్రదారుకు డెలివరీ చేశానని, అతను తన ఖాతాలోకి వచ్చిన $9000ని భారతదేశంలోని గుర్తు తెలియని వ్యక్తి ఖాతాలో  జమ చేశాడని వివరించాడు.

డబ్బులు గల్లంతయ్యాయని బాధితుల నుంచి ఫిర్యాదుల తర్వాత అమెరికా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. చివరకు బుధదేవ్‌ను పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.  నేరం రుజువైతే ఫెడరల్ చట్టం ప్రకారం గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News