వెటరన్ షూటర్ దాదీ చంద్ర తోమర్ (89) కరోనాతో కన్నుమూశారు. మూడు రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమెకు.. మీరట్ మెడికల్ కాలేజీలో చికిత్స అందించారు. అయితే.. పరిస్థితి విషమించి, శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా.. మెదడులో కూడా రక్తస్రావం కావడంతో షూటర్ దాదీ కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్‌లో జన్మించిన దాదీ.. ప్రపంచంలోనే పురాతన షూటర్ గా ప్రసిద్ధి చెందారు. తన సోదరి ప్రకాశి తోమర్ తో కలిసి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ప్రపంచ పురాతన మహిళా షూటర్లలో దాదీ సోదరి ప్రకాశి కూడా ఉన్నారు.
వృద్ధాప్యంలోకి ప్రవేశించిన తర్వాత కూడా షూటింగ్ లో పాల్గొన్నారు దాదీ. సీనియర్ సిటిజన్ విభాగంలో కూడా ఆమె పలు పథకాలు గెలుచుకోవడం విశేషం. ఇందులో రాష్ట్రపతి అందించిన 'స్త్రీ శక్తి సమ్మాన్' పురస్కారం కూడా ఉండడం గమనార్హం.
ఇక, దాదీ సాహస గాథ వెండితెరపైనా ఆవిష్కృతమైంది. 'సాండా కి ఆంఖ్రూ' పేరుతో బాలీవుడ్ లో షూటర్ దాదీ బయోగ్రఫీని తెరకెక్కించారు. అలాంటి దాదీ మృతిపట్ల కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, నటి తాప్సీ, భూమీ ఫడ్నేకర్ తదితరులు సంతాపం తెలిపారు.