ఆన్‌లైన్‌ లో షాపింగ్ చేస్తున్నారా ..అయితే మీకు ఆ జబ్బు గ్యారెంటీ !

Update: 2019-11-06 05:36 GMT
ఆన్‌లైన్‌ షాపింగ్ ప్రస్తుతం ప్రతి ఒక్కరు దీనిపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ బిజీ ప్రపంచంలో తినడానికి , పడుకోవడానికే సరైన సమయం ఉండటం లేదు . అసలు తిన్నామా లేదా అని కూడా కొంతమంది ఆలోచించడం లేదు. ఈ కారణం చేత చాలామంది ఈ  మధ్య కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్ పై వడివడిగా అడుగులు వేస్తున్నారు.  ఆన్‌లైన్‌ షాపింగ్ అయితే అక్కడికే వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. మనకి నచ్చింది బుక్ చేస్తే ..అదే మన ఇంటికి వస్తుంది. అలాగే ఆన్‌లైన్‌ లో ఆఫర్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. దీనితో ఆన్‌లైన్‌ లో షాపింగ్ చేస్తే డబ్బుకి డబ్బు ఆదా అవుతుంది. అలాగే సమయం కూడా ఎక్కువగా తీసుకోవాల్సిన పనిలేదు. కేవలం పదే పదే నిముషాల్లో మనకి కావాల్సిన అన్ని వస్తువులని తీసుకోవచ్చు.

కానీ, ఇది ఎంత వరకు మంచిది అనే దానిపై ఎవరు ఆలోచించడంలేదు. ఈ పద్దతి ఇలాగే కొనసాగితే వచ్చే రోజుల్లో చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అలాగే డిజిటల్‌ మాధ్యమాల దుర్వినియోగం కారణంగా 2024 యేడాదికల్లా ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఒక వ్యసనంగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తించింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ని ఎక్కువగా దుర్వినియోగం చేసుకోవడం కారణంగా లక్షలాది మంది ఆర్థిక ఒత్తిడికి లోనవుతారని,  అంతర్జాతీయ అధ్యయన సంస్థ గార్టనర్‌ అభిప్రాయపడింది. ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా వినియోగదారులు చేసే వ్యయం ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతూ పోతుంది అని ఈ అధ్యయనంలో వెల్లడైంది. నడవకుండా, ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్‌ లో  ఏదిపడితే అది కొనేసే అలవాటు వల్ల ఒత్తిడికీ, మానసిక ఆందోళనకు గురవుతారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
Tags:    

Similar News