బెడ్ రూమ్ లో నెమలి పింఛాన్ని పెట్టుకుంటే ఎన్ని లాభాలంటే?

Update: 2020-03-14 22:30 GMT
నెమలి ఫించంతో వాస్తు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.   నెమలి కుమార స్వామి వాహనం. నెమలిని జాతీయ పక్షి...ఆ నెమలి  ఫింఛం శ్రీకృష్ణుని కిరీటంపై నిత్యం నివసిస్తూ వుంటుంది. అయితే,  ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆ  నెమలి ఫింఛానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత వుంది. నెమలి పింఛాన్ని పూజగదిలో వుంచి పూజించడం ద్వారా ఆ కుటుంబానికి పట్టిన సకల దోషాలు పోయి, ఆ కుటుంబం మొత్తం సిరిసంపదలతో ఆనందంగా ఉంటుంది.

వర్షంలో నెమలి నృత్యం చేస్తుంది. ఆ సమయంలో నెమలి శరీరం నుంచి నేలరాలే వాటి ఫించాలను తీసుకొచ్చి... ఇంట్లోని పూజగదిలో వుంచినట్లైతే వాస్తుదోషాలు తొలగిపోతాయి.  ముఖ్యమైన విషయం ఏమిటంటే .. వాటికంతట అవే నెమలి నుంచి ఊడిన నెమలి ఫించంలను మాత్రమే దేవుని పూజకు వాడాలి.

ఇంటి వాస్తు దోషాన్ని నివృత్తి చేయాలంటే.. ఎనిమిది నెమలి ఫించములను ఒక చోట పెట్టి .. ఓ తెలుపు రంగు దారంతో కట్టాలి. ఆ తరువాత  వాటినిపూజ గదిలో వుంచి.. ''ఓం సోమాయ నమః'' అనే మంత్రాన్ని ఉచ్ఛరించడం ద్వారా ఆ దోషాలు తొలగిపోతాయి. అలాగే పురాణాల ప్రకారం బీరువాల్లో ఒక నెమలి ఫించాన్ని వుంచడం ద్వారా ధనాదాయం వృద్ధి చెందుతుంది. అప్పుల బాధలుండవు. ఇంకా నెమలి ఫించం ఇంటి ప్రధాన ద్వారంపై వుంచడం ద్వారా ప్రతికూల ఫలితాలు వుండవు.

కార్యాలయాల్లో మన సీటు ముందు నెమలి ఫింఛాన్ని వుంచితే పనితీరు మెరుగుపడుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. కొత్త దంపతులు లేదా భార్యాభర్తలు తమ పడకగదిలో నెమలి ఫింఛాన్ని వుంచడం ద్వారా.. అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య ఏవైనా సమస్యలుంటే తొలగిపోతాయి. అలాగే మూడు నెమలి ఫింఛాలను చేర్చి నలుపు రంగు దారంతో కట్టి.. వక్కల పొడి నానబెట్టిన చెంబు నీటిని తీసుకుని నెమలి ఫింఛముతో ఇంటిల్లపాది చల్లుతూ.. "ఓం శనీశ్వరాయ నమః" అనే మంత్రాన్ని 21సార్లు ఉచ్చరించాలి. ఇలా చేస్తే శనిదోషాలు పారిపోతాయని ఆధ్యాత్మిక పండితులు  చెప్తున్నారు.
Tags:    

Similar News