పాకిస్తాన్ లో పుట్టి ఐపీఎల్ ఆడుతున్న ఒకే ఒక్కడు

Update: 2023-04-16 21:00 GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రపంచంలోని అన్ని దేశాల వారు పాల్గొంటున్నారు. అన్ని దేశాల వారిని ఐపీఎల్ జట్లు కొని ఆడిస్తున్నాయి. కానీ మన శత్రుదేశం పాకిస్తాన్ క్రికెటర్లను మాత్రం మన ఐపీఎల్ లో ఆడనివ్వడం లేదు. వారికి ప్రవేశం లేదు. ఎప్పటి నుంచో పాక్ ఆటగాళ్లను ఇందులో ఆడడానికి అనుమతించడం లేదు. ఇంతవరకూ ఒక్క పాకిస్తాన్ క్రికెటర్ కూడా ఐపీఎల్ లో ఆడలేదు.

అయితే పాకిస్తాన్ లో పుట్టి ఐపీఎల్ లో అదరగొడుతున్న ఒకే ఒక్క క్రికెటర్ గా సికిందర్ రాజా ఉన్నారు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ సికందర్ రజా శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఫిఫ్టీ చేసిన జింబాబ్వే జట్టు తరుఫున మొదటి ఆటగాడిగా నిలిచాడు. లక్నో స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్ (ఎల్‌ఎస్‌జి)తో జరిగిన పోరులో 41 బంతుల్లో 57 పరుగులతో రజా ఈ ఫీట్ సాధించాడు.

160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరు ఓవర్లలో 45 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌కు పాకిస్తాన్‌లో జన్మించిన 36 ఏళ్ల క్రికెటర్ రాజా జట్టును ఆదుకొని ఆఫ్ సెంచరీతో విజయం దిశగా నడిపించాడు.రజా ఒక దశలో 17 బంతుల్లో 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే అతను ఒక్కసారిగా గేర్ మార్చాడు. కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టాడు.  

ఆ తర్వాతి ఓవర్లో కృనాల్ పాండ్యా ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 34 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేశాడు. హర్‌ప్రీత్ బ్రార్ , సామ్ కుర్రాన్‌లతో కలిసి కీలకమైన 37 పరుగుల భాగస్వామ్యాన్ని చివర్లో నెలకొల్పాడు.ధాటిగా ఆడే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు.

  రజా నిష్క్రమణ తర్వాత 12 బంతుల్లో పంజాబ్  ఇరవై పరుగులు చేయాల్సి ఉంది. షారుక్ ఖాన్ 10 బంతుల్లో 23 పరుగులు చేయడంతో పంజాబ్ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు మ్యాచ్‌లో రజా తన ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్‌తో దీపక్ హుడాను కూడా స్టంప్స్ ముందు ట్రాప్ చేశాడు.  ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున రజా ఇప్పటివరకు 79 పరుగులు చేసి రెండు వికెట్లు తీశాడు.  

ఇలా ఐపీఎల్ లో పాకిస్తాన్ లో పుట్టి జింబాబ్వేకు ఆడుతున్న ఏకైక క్రికెటర్ మనగడ్డపై రాణిస్తుండడం విశేషంగా చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఏ పాకిస్తాన్ క్రికెటర్ కు దక్కని గౌరవం రజాకు దక్కింది.

Similar News