కరోనా వైరస్ మహమ్మారి కట్టడిలో ప్రస్తుతం వ్యాక్సిన్ కీలక పాత్ర వహిస్తుంది. ప్రజలు టీకాలు వేసుకునేలా ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. కానీ కొందరు మాత్రం భయంతో టీకాలు వేసుకోవడం లేదు. దీనితో ఈ కీలకమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ లో పాక్ లోని పంజాబ్ ప్రభుత్వం విన్నూత్న నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందు ముందుకురాకుంటే.. వారి సిమ్ కార్డ్స్ బ్లాక్ చేస్తామని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలను వ్యాక్సిన్ దిశగా మరల్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ యాస్మిన్ రషీద్ తెలిపారు.
పాకిస్తాన్‌లో చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధికారులు చేరుకోలేకపోతున్నారు. మొదటి డోస్ తీసుకున్న వారు కూడా సెకండ్ డోస్ తీసుకునేందుకు కొంచెం జంకుతున్నారు. పాకిస్తాన్ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. మొదటి డోస్ తీసుకున్న దాదాపు 3 లక్షల మంది రెండో డోస్ వేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మొదటి డోస్ తీసుకున్న వారిలో చాలా మందికి కరోనా వచ్చింది. దీనితో వ్యాక్సిన్ గురించి ప్రజల నెగెటివ్ గా చర్చించుకుంటున్నారు. అందుకే వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. టీకా వేసుకోకుంటే సిమ్ కార్డ్ బ్లాక్ చేస్తామని స్పష్టం చేసింది. మనదేశంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అధికారులు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అర్హత ఉండి కరోనా టీకా తీసుకోకుండా.. బయట తిరిగితే.. వారికి రూ.500 జరిమానా వేస్తున్నారు.