కరోనా మొదలైనప్పటినుంచి ఈ రంగం ఆ రంగం అని కాదు..అన్నిరంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రయాణాలు ఆగిపోవడంతో రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విమానయాన రంగం ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయింది. ఇప్పుడిపుడే మళ్ళీ అనుమతులు ఇస్తుండటం తో కొన్ని పరిమితి మేర విమానాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నష్టాల్లో కూరుకుపోయిన సింగపూర్ విమానయాన సంస్థ ఆ నష్టాల నుంచి బయటపడేందుకు ఒక వినూత్న చర్యలు చేపట్టింది. వారు ఓ సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ప్రయాణ సమయాల్లో ప్రయాణికులు విమానాల్లో అందించే ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తీసుకోవడం తెలిసిందే. ఆ ఫుడ్ ను బాగా మిస్ అవుతున్నామని పలువురు చెప్పడం తో సంస్థ యాజమాన్యం కొత్త ఆలోచనకు రూపు దిద్దింది. విక్రయాలు చేపట్టి ఆహారాన్ని ఇంటింటా అంద జేస్తామని సింగపూర్ ఎయిర్ లైన్సు సంస్థ ప్రకటించింది.
ఈ మేరకు ఎయిర్ లైన్సు వారు అక్టోబర్ 4 నుండి ఫుడ్ హోం డెలివరీ సేవలను కూడా ప్రారంభించారు. ఈ సేవలను ప్రారంభించిన మరుసటి రోజు మధ్యాహ్నానికే 50 కి పైగా ఆర్డర్లు వచ్చాయి. బిజినెస్ క్లాస్ ఆహార ధర 288 డాలర్లకు, మొదటి తరగతిలో వడ్డించే ఆహారం జీఎస్‌టీ మినహా 488 డాలర్లు అందివ్వనున్నారు. అంతే కాదు ఎయిర్ లైన్సు సంస్థ ఆహారంతో పాటు వైన్ బాటిల్ ఇవ్వనుంది. బిజినెస్ అభివృద్దిలో భాగంగా ఎయిర్ లైన్సు చాంగి విమానాశ్రయంలోని A-380 జంబో జెట్ ప్లైట్ తాత్కాలిక రెస్టారెంట్ గా తెరవడానికి సిద్ధం చేస్తోంది. అక్టోబర్ 24 నుండి ఫ్లైట్ రెస్టారెంట్ తెరిచి ఫుడ్ బిజినెస్ రన్ చేయనున్నారు. ఇందులో తయారు చేసిన ఆహార పదార్థాలను అక్టోబర్ 12 నుండి బుకింగ్ చేసుకుని పొందవచ్చు. నష్టాలను పూడ్చుకునేందుకు సింగపూర్ ఎయిర్ లైన్సు సంస్థ భలే వ్యాపారం మొదలు పెట్టింది. అంతే కాదు నవంబర్ 21,22, 28, మరియు 29 తేదీలలో సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాయి. శిక్షణ రుసుము పిల్లలకు 16.06 డాలర్లు పెద్దలకు అయితే 32.10 డాలర్లు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నవంబర్ 1 నుండి ప్రారంభం కానున్నాయి.