పాపోన్ ముద్దు వివాదంలో మ‌రో ట్విస్ట్

Update: 2018-02-24 23:30 GMT
 బర్ఫీ - సుల్తాన్‌ - దమ్‌ లగా కే హైసా.. తదితర చిత్రాలతో పాపులర్ అయిన  అస్సామీ సింగర్‌ అయిన పాపోన్ చిక్కుల్లో ప‌డ్డాడు. ఓ షోలో  బాలిక‌కు ముద్దు పెట్టి, అది చాల‌ద‌న్న‌ట్లు తప్పుడు కెమెరా కోణాల వల్ల అలా అనిపించిందని, అనుకోకుండా జరిగిందని అన్నాడు.

ఓ ఛాన‌ల్ నిర్వ‌హించే వాయిస్ ఇండియా కిడ్స్ పోగ్రాంకు న్యాయ నిర్ణేత‌లుగా కిల్లింగ్ కిస్స‌ర్ హిమేష్ రేష్మియా - పాపోన్ గా పేరు పొందిన అన్గ‌రాగ్ మ‌హంతా న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఆ షో నిర్వాహ‌కులు ప్ర‌త్యేకంగా హోలీ ఎపీసోడ్ ను చిత్రీకించారు. ఆ స‌మ‌యంలో పాపోన్ గా హోలీ ఆడుతూ కంటిస్టెంట్ గా ఉన్న ఓ బాలిక‌కు లిప్ లాక్ పెట్టాడు. ఆ వ్య‌వ‌హారం అంతా ఫేస్ బుక్ లో లైవ్ టెలీకాస్ట్ అయ్యింది. అంతే సిగ్గు ఎగ్గూ లేకుండా బాలిక‌కు లిప్ లాక్ పెట్ట‌డం ఏంటంటూ దేశవ్యాప్తంగా  విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అంతేకాదు ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్ పోక్సో యాక్ట్ కింద పాపోన్ పై లైంగిక దాడి  కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు.  

దీంతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు పాపోన్ పై పోస్ట్ యాక్ట్ కింద కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు.

 ఇదిలా ఉంటే పాపోన్ ముద్దు పెట్టాడ‌ని ఓ వైపు దుమారం రేగుతుంటే ఆ మైన‌ర్ బాలిక  - ఆమె త‌ల్లిదండ్రులు సింగర్ కు మ‌ద్ద‌తు ప‌లికారు. పాపోన్ ముద్దు పెట్టుకోవ‌డం త‌ప్పుకాద‌ని - అత‌డ్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని - తన కూతురికి ఆయన తండ్రి వంటివాడని అన్నారు . ఈ వివాదంపై మైనర్ బాలిక స్పందించింది. సింగర్ తన సొంత బిడ్డను ముద్దు పెట్టుకన్నట్లు తనను ముద్దు పెట్టుకన్నడని  చెప్పింది.

మ‌రోవైపు రునా భుయాన్ పిటిష‌న్ తో  జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సింగర్ పాపోన్‌ కు, ఆ టీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్ చానెల్‌ కు నోటీసు జారీ చేసింది.

తానుపెట్టిన ముద్దుపై వివాదం జ‌రుగుతుంటే పాపోన్ క్ష‌మాప‌ణ‌చెప్పాడు. తప్పుడు కెమెరా కోణాల వల్ల అలా అనిపించిందని, అనుకోకుండా జరిగిందని చెప్పారు. ఫేస్‌బుక్‌లో వివర‌ణ ఇచ్చాడు. 
Tags:    

Similar News