ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కౌలు రైతులకు ఉండేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్ర ఇందుకు వేదికగా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలోని 41 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో.. ఆయా కుటుంబాలను పరామర్శించి.. ఒక్కోకుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇచ్చేందుకు ఈ రోజు (శనివారం) ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం వరకు ప్రత్యేక విమానంలో వెళ్లారు.
అక్కడ నుంచి ఆయన కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో జనసైనికుల హడావుడి ఒక రేంజ్ లో ఉంది. ఆయనపై పెద్ద ఎత్తున పూలు జల్లుతూ.. పూల దండలు వేస్తూ కేరింతలు కొట్టారు.
జనసైనికుల ఉత్సాహంతో జనసేన నేతలు ఆనందంతో ఉన్న వేళ.. అనూహ్య ఘటన చోటు చేసుకుంది. హనుమాన్ జంక్షన్ వేలేరు అడ్డరోడ్డు బైపాస్ దగ్గర పవన్ కల్యాణ్ కు పూలతో స్వాగతం పలికారు.
అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఉన్నట్లుండి అక్కడి జనసైనికుల సమూహంలో పలువురు జై జగన్ అంటూ నినాదాలు చేయటం విశేషం. ఇంతకూ ఎందుకిలా చేశారు? అన్న దానిపై స్పష్టత రావటం లేదు.
అధినేతను చూసిన ఆనందంలో మరింత జోరుగా జై పవన్ అంటూ నినాదాలు చేయాలే కానీ.. అందుకు భిన్నంగా జై జగన్ అంటూ నినాదాలు చేయటంతో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది.
ఈ పరిణామం జనసేన వర్గాలకు ఊహించిన షాక్ గా మారిందన్న మాట వినిపిస్తోంది.