ఈ మధ్యన ఉత్తరప్రదేశ్ మీద ఫోకస్ పెట్టిన ప్రియాంకా వాద్రా.. తనకు ఎదురవుతున్న పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనికి తగ్గట్లే.. ఆమెకు పలు పరిణామాలు సానుకూలంగా నిలుస్తున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు మీద కేంద్ర మంత్రి కుమారుడు కారుతో ఢీ కొనటం.. ఆ ఉదంతంలో పలువురు మరణించటం తెలిసిందే. అప్పటి నుంచి ఆ ఇష్యూ తేలేవరకు వదిలిపెట్టకుండా వ్యవహరిస్తున్నారు.
మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు రావటం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం పవర్లో ఉన్న యోగి ఆదిత్యనాత్ ను సీఎంపీఠం నుంచి దించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా ఆమె తీరు ఉంది. దీనికి తోడు యూపీలోనే ఉంటూ.. పలు వర్గాల వారితో మాట్లాడుతూ.. క్యాడర్ ను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యూపీలోని విలేకరులతో మాట్లాడూుతూ యోగి సర్కారు తీరును తీవ్రంగా తప్పుపట్టారు
అంతేకాదు.. తనను కలిసేందుకు ఆసక్తి చూపించే వారి విషయంలో నిరాశకు గురి చేయకుండా వారితో మాట్లాడటం.. వారితో కలిసి సెల్పీల్ని దిగి.. వారి మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అలానే కొందరు విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం ఇంటర్ పాస్ అయిన బాలికలకు స్మార్ట్ ఫోన్ ఇస్తామని... అదే సమయంలో డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చినంతనే తన హామీల్ని నెరవేరుస్తానని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ముందే ఆఫర్లను చెప్పేస్తున్న ప్రియాంక.. ఎన్నికల వేళకు మరెన్ని ఊరించే హామీల్ని తెర మీదకు తీసకొస్తారో?
అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో 40 శాతం పార్టీ అభ్యర్థులుగా మహిళల్నే బరిలోకి దింపనున్నట్లు వెల్లడించారు. యూపీ రాష్ట్ర ఎన్నికల విషయంలో ప్రియాంక చాలా సీరియస్ గా ఉండటమే కాదు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారు.అందుకు తగ్గట్లే ఆమె తాజా ప్రకటనలు ఉండటం గమనార్హం. మరి.. ప్రియాంక ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో కాలమే సరైన తీర్పు చెప్పగలదు.