ప్రతీకారమేనా.? స్మృతీ అనుచరుడి కాల్చివేత

Update: 2019-05-26 08:00 GMT
కాంగ్రెస్ కు కంచుకోటైన అమేథిలో  ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు బీజేపీ నాయకురాలు స్మృతీ ఇరానీ.. దీంతో కాంగ్రెస్ పార్టీయే అవమానాల పాలైంది. అయితే అమేథీలో ఓటమికి కాంగ్రెస్ పార్టీ  రగిలిపోతోంది.

తాజాగా అమేథిలో బీజేపీ ఎంపీ స్మృతీ ఈరానీ అనచరుడైన బరోలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడం సంచలనంగా మారింది. అమేథీలో రాహుల్ ను ఓడించిన స్మృతీకి అత్యంత విశ్వాసుడైన అనుచరుడి హత్య చోటుచేసుకోవడం ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

సురేంద్ర సింగ్ మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతీ తరుఫున కీలకంగా వ్యహరించి ప్రచారం చేశారు. ఈ ఉదయం 3 గంటల ప్రాంతంలో   సురేంద్ర సింగ్ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆయనపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

కాగా సురేంద్ర హత్యకు రాజకీయ వివాదాలే కారణమని అమేథి ఎస్పీ రాజేశ్ కుమార్ చెప్పారు. రాజకీయంగా పాతకక్షలున్నాయని.. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సురేంద్ర సింగ్ బరోలియా గ్రామ బీజేపీ సర్పంచ్ గా చేశారు. సర్పంచ్ పదవికి రాజీనామా చేసి మరీ స్మృతిని గెలిపించడానికి సార్వత్రిక ఎన్నికల్లో తీవ్రంగా కృషి చేశారు. ఏకంగా స్మృతీ కూడా తన వెంట సురేంద్రసింగ్ ను వెంట ఉంచుకొని అత్యంత విశ్వాసపాత్రుడిగా చూసుకుంది. ఇప్పుడు సురేంద్ర హత్యతో బీజేపీ షాక్ తిన్నది. సురేంద్ర హత్యపై విచారం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు స్మృతీ ఇరానీ ప్రగాఢసానుభూతి తెలిపారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
    

Tags:    

Similar News