బాలీవుడ్ నటి దీపికా పదుకునేపై , బీజేపీ కీలకనేత కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుక్డే తుక్డే గ్యాంగులకు మద్దతుగా నిలవాలనుకున్న ఆమె స్వేచ్ఛను తప్పుబట్టలేమని ఆమె వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఓ సదస్సులో స్మృతి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అది ఆమె స్వేచ్ఛ. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేవారికి మద్దతుగా నిలుస్తారన్న విషయం ఊహించిందే. వార్తలు చదువుతున్న ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంది. ఆమె హక్కును నిరాకరించలేను.
2011లో కాంగ్రెస్ కు మద్దతు పలికినప్పుడే రాజకీయాలతో తన అనుబంధాన్ని దీపిక బయటపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బహుశా.. తన స్థానాన్ని ఆమె గుర్తించినందుకేమో అని ఆమె వ్యాఖ్యానించారు. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్ ను శతృవులు చంపితే సంబరాలు చేసుకునే పార్టీలు లేదా ఆ పార్టీ నేతలకు మద్దతు గా దీపికా నిలుస్తోందని మండిపడ్డారు. ఈ నెల 5న జే ఎన్ యూ లో విద్యార్థులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ముసుగు ధరించిన వ్యక్తులు క్యాంపస్ లోకి ప్రవేశించి, విద్యార్థులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులపై దాడిని పలువురు ఖండించారు.
ఈ నెల 7న క్యాంపస్‌కు వెళ్లిన సినీ నటి దీపిక, గాయపడ్డ విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మద్దతు గా దీపిక నిలవడాన్ని పలువురు ప్రశంసించారు. అయితే , దీపికా క్యాంపస్ విద్యార్థులకు మద్దతు తెలపడంతో బీజేపీ నేత తజీందర్ బగ్గా మండిపడ్డారు. దీపికా నటించిన తాజా చిత్రం చపాక్ ను నిషేధించాల్సిందిగా బగ్గా పిలుపునిచ్చారు. అయితే దీపికా జేఎన్ యూ విద్యార్థులకు మద్దతుగా నిలవడంపై కొందరు స్వాగతించగా మరికొందరు వ్యతిరేకించారు.