సినిమాలు సమాజంపై బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మంచి అయినా.. చెడు అయినా సినిమాల్లో చూపిన దాన్ని గుడ్డిగా ఫాలో అవుతుంటారు. తాజాగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ను ‘స్మగ్లర్’ చూపించి పెద్ద హీరోగా ఫోకస్ చేయడాన్ని ప్రముఖ వక్త గరికపాటి నరసింహారావు తూర్పార పట్టిన సంగతి తెలిసిందే.
అయితే అప్పుడే పుష్ప ఎఫెక్ట్ కూడా కనిపిస్తోంది. ఆ సినిమా స్ఫూర్తితో భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ కు ప్రయత్నించిన ఓ వ్యక్తి పోలీసులకు దొరికపోవడం సంచలనం రేపుతోంది. పుష్ప సినిమాలో పోలీసుల కళ్లు గప్పి ఎర్రచందనం తరించడానికి హీరో రకరకాల మార్గాలు కనుక్కొంటాడన్న సంగతి తెలిసిందే.
పుష్ప సినిమాలో రకరకాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడాన్ని చూసి స్ఫూర్తి పొంది తాజాగా సినీ ఫక్కీలో కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని తరలిస్తున్న యాసిన్ ఇనాయతుల్లా అనే స్మగ్లర్ మహారాష్ట్రలో పోలీసులకు దొరికిపోయాడు.
ఎర్రచందనం దుంగలను ఒక ట్రక్కులో కింద పరిచేసి.. వాటి మీద కూరగాయలు.. పళ్లు పెట్టి కర్ణాటక బార్డర్ దాటించిన ఇనాయతుల్లా మహారాష్ట్రలో పోలీసుల తనిఖీ సందర్భంగా దొరికిపోయాడు. అతను రవాణా చేస్తున్న దుంగల విలువ రూ.2.45 కోట్లు కావడం గమనార్హం.
పోలీసుల కళ్లు గప్పాడో వాళ్లకు లంచాలిచ్చి బయటపడ్డాడో కానీ.. కొన్ని వందల కి.మీలు సాఫీగానే ఆ స్మగ్లర్ ప్రయాణం సాగిపోయింది. కానీ మహారాష్ట్ర పోలీసులు మాత్రం ఇనాయతుల్లాను విడిచిపెట్టలేదు. ‘పుష్ఫ ’ సినిమాస్పూర్తితోనే ఇలా చేసినట్లు సదురు స్మగ్లర్ పోలీసులకు చెప్పాడట.. సంబంధిత ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.