సర్వం ఆన్ లైన్ మయం అయిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కామర్స్ సైట్లు విభిన్న ఆఫర్లతో దూసుకువస్తున్నాయి. ఎన్నో కంపెనీలు తమదైన ప్రత్యేకతలతో ముందుకు వస్తూ...వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే కొన్నే టాప్ లో నిలుస్తున్నాయి. ఇందులో ఫ్లిఫ్ కార్ట్, స్పాప్ డీల్ , అమెజాన్ వంటివి ముఖ్యమైనవి.
ఈ సిరీస్ లో ప్రథమ స్థానంలో ఉన్న స్నాప్ డీల్ తనదైన శైలిలో కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఇక నుండి ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చిన వస్తువుల కోసం రోజుల తరబడి ఎదురు చూడనవసరం లేదు, కేవలం ఒక్క గంట లోనే ప్రోడక్ట్ ను ఆర్డర్ ఇచ్చిన వారి దగ్గరకి చేరుస్తాం అంటూ స్నాప్ డిల్ ప్రకటించింది. అయితే మనం ఆర్డర్ ఇచ్చిన వస్తువు బరువు ఐదు కేజీల లోపు ఉండాలని షరతు విధించింది. సాధారణంగా ఆన్ లైన్ లో ఆర్డరిచ్చే వస్తువులు మొబైల్స్, షూస్ వంటివే ఎక్కువగా ఉన్నందున అవి పెద్దగా బరువు ఉండవు.
ప్రస్తుతం ముంబై, ఢిల్లీ తరహా నగరాల్లో ఈ విధానానికి రెడీ అయిపోయింది స్నాప్ డీల్. ఈ కామర్స్ లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న హైదరాబాద్ ను మాత్రం విస్మరించింది. ఆ నగరాల్లో వచ్చిన ఫలితాలను బట్టి అమలుచేసే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి స్నాప్ డీల్ చేసిన ఈ ప్రయోగం విజయవంతం అయితే మిగతా సంస్థలు ఖచ్చితంగా గట్టి పోటి ఎదుర్కోవల్సి ఉంటుంది. అమెజాన్,ఫ్లిప్ కార్ట్ వంటి ప్రత్యర్థి సంస్థలు దీన్ని ఎలా ఎదుర్కుంటాయో చూడాలి మరి.