మీరో బైక్ కొనాలనుకుంటున్నారు. ఏం చేస్తారు? కొనాలనుకున్న రెండు మూడు కంపెనీల మోడళ్లు ఒకసారి చెక్ చేసుకొని.. వాటి మీద ఉన్న ఆఫర్లు చెక్ చేసి.. ఫైనాన్స్ మీదున్న సౌకర్యం ఏమిటి? తదితర వివరాలన్నీ సేకరించి కొనుగోలు చేయటం మామూలే. ఇప్పుడీ విధానానికి చెల్లుచీటి ఇచ్చేయొచ్చు. ఈ మధ్యకాలంలో ప్రతి వస్తువును ఈ కామర్స్ ద్వారా కొనుగోలు చేయటం ఎక్కువైంది. దీన్ని మరింత విస్తృతి చేస్తూ.. బైకులు కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చేసే అవకాశాన్ని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ అందుబాటులోకి తెచ్చేసింది.బుధవారం నుంచి ఈ సదుపాయాన్ని స్నాప్ డీల్ కల్పిస్తోంది. ఇందుకోసం కొన్ని కంపెనీలతో ప్రత్యేక ఒప్పందాల్ని చేసుకుంది. తమకు నచ్చిన వాహనాల్ని ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్నీఏర్పాట్లు స్నాప్ డీల్ చేసేసింది.
అవసరమైతే టెస్ట్ డ్రైవ్ ల వసతి కూడా కల్పించనున్నట్లు కంపెనీ చెబుతోంది. ధరల తనిఖీ మొదలు.. ఫైనాన్స్ సౌకర్యం వరకూ అన్ని సేవల్ని ఆన్ లైన్ ద్వారా అందించే ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం హీరో మోటార్ కార్ప్.. పిగియోతో ఒప్పందం చేసుకున్న స్నాప్ డీల్.. రానున్న రోజుల్లో మహేంద్ర.. సుజుకి మోటార్ సైకిల్.. డస్టన్ తో ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తంది. ఆన్ లైన్ లో బైకుల అమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.
కొసమెరుపు ఏంటంటే... బైకులే కాదు, 8-9 తేదీల్లో ఆఫర్లతో ఇళ్లను కూడా అమ్మేస్తోంది. !