హిట్ మ్యాన్ @ 13 ఏళ్లు .. ఆ రికార్డ్ ఉన్న ఏకైక క్రికెటర్ !

Update: 2020-09-19 12:10 GMT
రోహిత్ శర్మ… క్రికెట్ ప్రేమికులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్ మ్యాన్ గా అభిమానులు ముద్దుగా పిలిచే రోహిత్ శర్మ ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే, ప్రపంచంలో ఎలాంటి బౌలర్ అయినా బాల్ వేయడానికి భయపడాల్సిందే. సిక్సర్లతో సునామీ క్రియేట్ చేసే రోహిత్ శర్మ, బౌండరీలతో వారిని ఉతికి ఆరేస్తాడు. రోహిత్ ఫామ్‌లో ఉంటే… అతను ఓ ఏలియన్‌గా కనిపిస్తాడని చాలామంది క్రికెటర్లు చెప్తారు. రికార్డుల రారాజు, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రోహిత్ శర్మ, తన కంటే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని ఓపెన్‌గా ప్రకటించాడు. 13 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు ఈ నాగ్‌ పూర్ హీరో... ‘హిట్ మ్యాన్’ క్రియేట్ చేసిన కొన్ని అద్భుతమైన రికార్డులు ఇవి.

వన్డే, టీ20, టెస్టుల్లో సిక్స్‌తో తొలి సెంచరీ పూర్తిచేసుకున్న క్రికెటర్ రోహిత్ శర్మ. జూన్ 23, 2007లో ఐర్లాండ్‌పై వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. రోహి త్‌శర్మ 2007 ప్రపం చకప్‌లో ఐర్లాండ్‌పై జరిగిన లీగ్‌ మ్యాచ్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరం గేట్రం చేశాడు. కెరీర్‌ ప్రారం భంలో మిడిలార్డర్‌ బ్యాట్స్ ‌మన్ ‌గా కొనసా గా డు. రోహిత్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్‌ 9వికెట్ల తేడాతో విజయం సాధించిం ది.అనంతరం 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కిం చుకు న్నా డు. ఈ టోర్నీలో ధోనీ నాయకత్వంలో సౌతాఫ్రి కా తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో అర్ధశతకం చేయడంతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలి చాడు.

అయితే టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వడానికి రోహిత్ శర్మ ఏడేళ్లు పట్టింది. 2013, నవంబర్‌ 6న టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 177 పరుగులు సాధించాడు. ఆరు అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి మొదటి మ్యాచ్‌లోనే అత్యధిక స్కోరు చేసిన క్రికెటర్ రోహిత్ శర్మనే. టీ20ల్లో నాలుగు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు నమోదుచేసిన క్రికెటర్‌గా ఉన్నాడు. శ్రీలంకపై కెప్టెన్‌గా 118 పరుగులు చేసిన రోహిత్ శర్మ, టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక స్కోరు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. వన్డేల్లో 29 సెంచరీలు చేసిన హిట్ మ్యాన్, సచిన్ టెండూల్కర్ 49, విరాట్ కోహ్లీ 43 తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒకే సీజన్‌లో ఐదు సెంచరీలు సాధించిన ఒకే ఒక్క క్రికెటర్ రోహిత్ శర్మ.

ఒకే మ్యాచ్‌లో 33 ఫోర్లు బాదిన రోహిత్ శర్మ, వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన క్రికెటర్‌గా నిలిచాడు. బౌండరీలతో 186 పరుగులు రాబట్టిన రోహిత్ శర్మ, షేన్ వాట్సన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. వన్డేల్లో 8 ఇన్నింగ్స్‌ల్లో 150+ స్కోరు సాధించిన రోహిత్ శర్మ, సచిన్, వార్నర్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. వన్డేల్లో మూడు సార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ, వన్డేల్లో అత్యధిక స్కోరు 264 కొట్టిన క్రికెటర్ కూడా రోహితే. ఐపీఎల్‌లో హ్యాట్రిక్ తీసిన రోహిత్ శర్మ, కెప్టెన్‌గా ముంబై జట్టుకు నాలుగు సార్లు ట్రోఫీ అందించాడు. 217 వన్డేలు ఆడిన రోహిత్ శర్మ 32 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇది కూడా ఓ రికార్డే..
Tags:    

Similar News