ఒక రోజు ఇన్ని విజయాలా? గెలిచిన ప్రతి ఒక్కటి దేశ కీర్తిప్రతిష్ఠలను పెంచేవే. ఇలాంటి ఒక రోజు రావటం చూస్తే భారతీయుడి గా ఎంతో ఆనందానికి గురి కావటం ఖాయం. కొన్నేళ్ల క్రితం క్రీడల్లో మనవారి ప్రతిభ మీద తరచూ ఆవేదన వ్యక్తమయ్యేది. కొద్దికాలంగా పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నిన్నటి ఆదివారం దేశ ప్రజలకు సూపర్ సండే గా మారింది. ఒకటి కాదు రెండు కాదు వివిధ వేదికల మీద మన క్రీడాకారులు సాధించిన అద్భుత విజయాలు దేశ ప్రతిష్ఠను మరింత పెంచేలా చేశాయి.
శనివారంతో మొదలైన అద్భుత విజయాల పరంపర ఆదివారం మరిన్ని అంశాల్లోనూచోటు చేసుకుంది. శనివారం రెండు స్వర్ణాలతో.. ఇద్దరు మహిళా బాక్సింగ్ క్రీడాకారిణులు వారి విభాగాల్లో ప్రపంచ టైటిల్ ను సొంతం చేసుకుంటే.. ఆదివారం మన తెలుగమ్మాయి నిఖత్ జరీనా..లవ్లీనాలు మరో రెండు ప్రపంచ టైటిళ్లను తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో.. తాజాగా ముగిసిన ప్రపంచ చాంపియన్ షిప్ లో మన దేశానికి చెందిననలుగురు బాక్సర్లు స్వర్ణ పతకాల్ని సాధించి.. ప్రపంచ టైటిళ్ల ను సొంతం చేసుకున్నారు.
బ్యాడ్మింటన్ లో డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి స్విస్ ఓపెన్ విజేతగా నిలిచారు. భోపాల్ వేదికగా సాగుతున్న రైఫిల్ -పిస్టల్ వరల్డ్ కప్ లో యువ షూటర్ సిఫ్త్ కౌర్ సమ్రా కాంస్య పతకాన్ని సొంతం చేసుకో గా.. ముంబయిలో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో ముంబయి ఇండియన్స్ తొలి సీజన్ చాంపియన్ గా అవతరించింది. వీటితో పాటు.. ఇస్రో ప్రయోగించిన 36 శాటిలైట్ల వాణిజ్య రాకెట్ ప్రయోగం విజయవంతం కావటం తెలిసిందే. ఇలా.. ఆదివారం ఒక్కరోజున బోలెడన్ని విజయాలతో దేశ కీర్తి పతాకం రెపరెపలాడింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.