రఘురామ ఆన్ లైన్ విచారణకు అంత డిమాండా?

Update: 2021-05-18 05:30 GMT
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఐడీ దాఖలు చేసిన కేసుల్లో బెయిల్ కోసం.. ఆయనకు వైద్య చికిత్సలు అందించటం కోసం సుప్రీంకోర్టులో విచారణ జరగటం తెలిసిందే. ఈ కేసు విచారణకు ఎంపీ రఘురామ తరఫున.. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రముఖ లాయర్లు తమ వాదనలు వినిపించారు. రఘురామను ఏ ఆసుపత్రికి తరలించాలన్న అంశంపై విచారణ జరిగింది. పలు ఆసుపత్రుల ప్రస్తావన వచ్చినా.. చివరకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలోచికిత్స చేయించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.

ఈ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆన్ లైన్ లో జరుగుతున్న ఈ విచారణను చూసేందుకు సుప్రీంకోర్టు యాప్ లో పెద్ద ఎత్తున లాగిన్ లు చోటు చేసుకోవటం గమనార్హం. దాదాపు 80 మందికిపైనే లాగిన్ కావటంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. విచారణ యాప్ పదే పదే సాంకేతిక సమస్యలు ఎదురుకావటంతో.. ఎందుకలా జరుగుతుందన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఆరా తీసింది.

దాదాపు 80 మందికి పైనే లాగిన్ అయ్యారని.. అందుకే సమస్య వస్తుందని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ కేసును ఇంత మంది ఆసక్తిగా చూడటాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గమనించిన వెంటనే.. చాలామంది లాగ్ వుట్ కావటం గమనార్హం. అయితే.. ఈ కేసు విచారణను ఏపీకి చెందిన 20 మంది అధికారులు ఉన్నట్లుగా సీనియర్ న్యాయవాది ఆదినారాయణ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఎంపీ రఘురామ కేసు విచారణకు ఎంత ప్రాధాన్యత ఉందన్న విషయం తాజా ఉదంతం చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.


Tags:    

Similar News