23 సెంటిమెంట్ వర్సెస్ వై నాట్ 175

Update: 2023-03-24 15:47 GMT
ఒక బలమైన నినాదం ఇపుడు పూర్తిగా కామెడీ పీస్ అయిపోయింది. విధి అంటే ఇదే కాబోలు. వైసీపీ పెద్దల పరిభాషలో చెప్పాలంటే దేవుడి స్క్రిప్ట్ కూడా ఇదే అని భావించాలేమో. ఏది ఏమైనా ఇపుడు 23 సెంటిమెంట్ వర్సెస్ వై నాట్ 175 అన్న దాని మీద అటూ ఇటూ సోషల్ మీడియాలో ఒక లెవెల్ లో వార్ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లూ మనవే అని క్యాడర్ లో బలమైన విశ్వసం నింపడానికి జగన్ వై నాట్ 175 అన్న స్లోగన్ అందుకున్నారు.

ఇపుడు దాన్ని సెటైరికల్ గా చిత్తు చిత్తు చేస్తూ టీడీపీ గట్టిగా తగులుకుంటోంది. ఇక 23 నంబర్ ని చూస్తే జగన్ 2019 అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక జరిగిన తొలి సమావేశంలో దేవుడి స్క్రిప్ట్ ఇది అని చెప్పుకొచ్చారు. తమ నుంచి 23 ఎమ్మెల్యేలను టీడీపీ తీసుకుందని, దాని ఫలితమే దేవుడు అదే నంబర్ లో సీట్లు టీడీపీకి ఇచ్చారని చంద్రబాబు సభలో ఉండగానే హాట్ కామెంట్స్ చేశారు.

ఆ తరువాత అనేక ఎన్నికలు జరిగితే ఈ 23 నంబర్ నే వైసీపీ వాడుతూ టీడీపీని తెగ ఏడిపించేసింది. ఇపుడు చూస్తే కధ అడ్డం తిరిగింది. 2023 సంవత్సరం, మార్చి 23వ తేదీ 23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించారు. దాంతో వైసీపీకి 23 నంబర్ తిరగబడింది. నిజంగా ఇది వైసీపీకి అతి పెద్ద షాక్ గా మారింది.

మరో విధంగా చెప్పాలీ అంటే ఎమ్మెల్సీ ఎన్నికలే వైసీపీకి పీడ కలగా మారాయి. పట్టభద్రుల ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి కోలుకోకముందే ఇపుడు అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే తీరున వైసీపీకి కరెంట్ షాక్ కొట్టేసింది. ఏకంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడడంతో వైసీపీ నిలబెట్టిన ఏడవ అభ్యర్థి కోలా గురువులు ఓటమి పాలు అయ్యారు.

ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో ఒక రేంజిలో డైలాగ్ వార్ సాగుతోంది. టీడీపీ వైసీపీ మీద ఎదురుదాడికి దిగిపోయింది. వై నాట్ 175 సీట్లు అన్నారు అలాగే పాతిక ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అన్నారు. ఇపుడు ఏమంటారు అంటూ జగన్ నినాదాల్నే తమ ఆయుధాలుగా మార్చుకుని టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇప్పటిదాకా జరిగిన లోకల్ బాడీస్ ఎన్నికలు, ఉప ఎన్నికలు అన్నీ కలసి వైసీపీకి పూర్తి ధైర్యాన్ని ఇచ్చేశాయి. కుప్పంలో సైతం లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడంతో ఇక చంద్రబాబు ఓటమి ఖాయమన్న తీరున వైసీపీ అధినాయకత్వం దృఢ విశ్వాసం వ్యక్తం చేస్తూ వచ్చింది.

అయితే వైసీపీ నుంచి వై నాట్ 175 అంటూ ఇంతకాలం రెట్టిస్తూ వచ్చిన స్లోగన్స్ ని చూసి చూస్ ఓర్చుకున్న టీడీపీ తమ్ముళ్లకు ఇపుడు సరైన సమయం వచ్చింది. అందుకే వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఎమెంల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు గెలిచిన తరువాత ఇక పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్నారు.

ఇపుడు తనదీ చాన్స్ అంటూ వై నాట్ 175 సీట్లు అని జగన్ స్లోగన్నే టీడీపీ కూడా చేస్తోంది. దాని భావమేంటి అంటే పులివెందులలో జగన్  సీటుని కూడా తాము గెలుచుకుని మొత్తానికి మొత్తం ఓడించి పారేస్తామని చెప్పడమే అంటున్నరు. జగన్ కి కంచుకోటలు అయిన రాయలసీమ జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ అంచనాలు లేకుండానే టీడీపీ ఇంతటి విజయం సాధించిన నేపధ్యంలో ఇక జగన్ సొంత సీటు పులివెందులలోనూ తమకు అవకశాకు కచ్చితనా ఉంటాయని టీడీపీ భావించడంలో అర్ధం ఉందని అంటున్నారు.

లేటెస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికతో టీడీపీ 23 సెంటిమెంట్ ని రివర్స్ చేస్తూ వైసీపీలో మంట పుట్టిస్తోంది. నాడు తమకు బ్యాడ్ సెంటిమెంట్ గా ఉన్న 23 నంబర్ ఇపుడు గుడ్ సెంటిమెంట్ అవుతోంది అని అంటోంది. ఇదే టీడీపీ జాతకాని తిరగరాస్తుంది అని తమ్ముళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇదే 23 నంబర్ ని దాటి టీడీపీ ఎప్పటికీ ముందుకు పోదని వైసీపీ అంటోంది. చంద్రబాబుకు ఆ పార్టీ నేతలకు 23 నంబర్ దాటే శక్తి లేదని ఎద్దేవా చేస్తోంది. 2024 ఎన్నికల్లో సైతం మరోసారి 23 సీట్లే వస్తాయని, దానికి సంకేతమే 23 ఓట్లతో పంచుమర్తి అనూరాధ గెలుపు అని వైసీపీ నేతలు అంటున్నారు.

అయితే దీనికి టీడీపీ కూడా వెనువెంటనే కౌంటర్ ఇచ్చి పడేసింది. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి జగన్ని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం చేతమనై పులివెందులలోనూ టీడీపీ గెలుస్తుంది అని తమ్ముళ్ళు వీర లెవెల్ ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇలా 23 సెంటిమెంట్ వర్సెస్ వై నాట్ 175 ఏపీ పాలిటిక్స్ లో ఇపుడు సూపర్ గా ట్రెండింగ్ అవుతోంది. మరి ఇది ఎన్నాళ్ల పాటు హీటెక్కిస్తుందో ఈ ముచ్చట ఎన్నాళ్ళ పాటు సాగుతుందో చూడాల్సిందే.           


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News