సెల్ ఫోన్ కాపాడుకునే ప్రయత్నం యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు బలి తీసుకుంది. రైలు మార్గంలో దోపిడీ దొంగల దుర్మార్గం.. ఈ యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిండు ప్రాణాలు బలి తీసుకుంది. దొంగల నుండి తన సెల్ ఫోన్ ను కాపాడుకునే ప్రయత్నంలో రైలు నుండి జారిపడ్డ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. అక్కడికక్కడే మృతి చెందాడు.
వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్... గురువారం తొలి ఏకాదశి, బక్రీద్ సెలవుదినం కావడంతో ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి గడిపేందుకు ఇంటికి వెళ్లాలని భావించాడు. దీంతో బుధవారం సాయంత్రం శాతవాహన రైల్ లో సికింద్రాబాద్ నుండి కాజిపేటకు బయలుదేరాడు.
ఈ ప్రయాణంలో రైల్ బీబీనగర్ సమీపంలోకి రాగానే రైల్వే ట్రాక్ పక్కన కర్రలతో కాపుకాసిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు సెల్ ఫోన్ చోరీకి ప్రయత్నించారని తెలుస్తుంది.
దీంతో ఫుట్ బోర్డ్ వద్ద నిలబడి ఉన్న శ్రీకాంత్ చేతిలోని సెల్ ఫోన్ ను కర్రతో కొట్టి లూటీ చేసేందుకు ఆ దుండగులు ప్రయత్నించారట. ఈ సమయంలో తన సెల్ ఫోన్ కాపాడుకునే ప్రయత్నంలో రైలు నుండి జారిపడిన శ్రీకాంత్... దురదృష్టవశాత్తు అక్కడికక్కడే మృతి చెందాడు. సెల్ ఫోన్ లూటీకి ప్రయత్నించిన ఆ దుండగులు అక్కడినుండి పారిపోయారని తెలుస్తుంది.
ఇలా ఇంటికి వస్తున్నానన్న కొడుకు రాకకోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు.. శ్రీకాంత్ మరణవార్త తెలియగానే బోరున విలపిస్తున్నారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సెల్ ఫోన్ దొంగల దుర్మార్గం ఇంత దారుణానికి కారణమైంది. మృతుడి స్వగ్రామం కమలపూర్ మండలం నెరేళ్ల అని తెలుస్తుంది.
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, దక్షిణ మధ్య రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలను నియమించి ప్రత్యక్ష సాక్షుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు.