కాశ్మీర్ సరిహద్దులో జరిగిన ఉగ్రపోరులో చిత్తూరు జిల్లాకు చెందిన కమాండో వీర మరణం పొందాడు. ఆదివారం కుష్వారా సెక్టార్ లోని మాచెల్ నాలా పోస్టు వద్ద దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించే ఆపరేషన్‌లో 15 మంది టీమ్ లో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆరుగురు ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ప్రవీణ్ కుమార్ రెడ్డితోపాటు మరో ఇద్దరు భారత్ సైనికులు చనిపోయారు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పిన కొడుకు అనంతలోకాలకు చేరుకోవడంతో కుటుంబ సభ్యుల భాదను ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు.
ప్రవీణ్ 2009లో అదే మండలంలోని ఐలవారిపల్లి గ్రామానికి చెందిన దగ్గరి బంధువు రామచంద్రారెడ్డి కుమార్తె రజితతో పెళ్లి జరిగింది. దేశ సేవచేస్తానని పట్టుబట్టి పద్దెనిమిదవ ఏటే మిలటరీలో చేరాడు. దేశం కోసం ప్రాణాలు విడిచి పెట్టడానికి కూడా వెనకాడేదిలేదని చెప్పేవాడు. చివరికి మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. ప్రాణాలు కోల్పోయాడని బాధగా ఉన్నా దేశం కోసం అశువులు బాసినందుకు గర్వంగా ఉంది. నాలుగు రోజుల క్రితమే ఫోన్ చేశాడు. ‘నాన్నా.. అమ్మ జాగ్రత్త. కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇంట్లో ఎవరూ బయటకు వెళ్లొద్దు. సంక్రాంతికి వస్తున్నా. అందరం కలుద్దాం’ అని చెప్పాడు. తను చెప్పినట్టే సంక్రాంతికి వస్తున్నాడు కదా అని సంబరపడ్డాను. దేశంలో ఎక్కడ ఉన్నా సంక్రాంతికి మాత్రం గుమ్మం ముందు ఉండేవాడు... దుఃఖంతో ఆ తండ్రి గొంతులో మాటలు తడబడుతునే చెప్పాడు. తన ఊరిలో చాలామంది సైన్యంలో పనిచేస్తుండడం చూసి తాను దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం మద్రాసు రెజ్మెంట్–18లో చేరారు. ప్రస్తుతం ఆయన స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమాండోగా పనిచేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి మృతి సమాచారం అందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
2002 ఊటీలో జరిగిన ఆర్మీ సెలక్షన్స్ లో పాల్గొన్నారు. ఊటీలోనే సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకున్నాడు. డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌లోని కప్పూర్‌తలాలో విధుల్లో చేరాడు. రెండేళ్లు పని చేశాక అస్సాంకు వెళ్లాడు. ఆ సమయంలో కర్ణాటకలోని బెల్‌గామ్‌లో ఆరు నెలలపాటు కమాండెంట్‌గా శిక్షణ పొందాడు. 2012–2016 వరకు ఢిల్లీలోని నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్(ఎన్‌ఎస్‌ఎఫ్)లో విధులు నిర్వహించాడు. అక్కడినుంచి మళ్లీ 2017–18వరకు జమ్మూలోని మీరాన్ సాహెబ్ ప్రదేశంలో పనిచేశాడు. 2019 సంవత్సరంలో పాకిస్థాన్ సరిహద్దులో అడుగుపెట్టి ఒక సైనికుడు చేరవలసిన అసలైన చోటుకు చేరానని గర్వపడ్డాడు. దేశ సరిహద్దు ఎప్పుడూ మంచు దుప్పటితో కప్పబడి ఉండటంతో శత్రువుకు అవకాశం ఇవ్వకూడదని కేవలం నాలుగు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవారట. కంటిపై రెప్ప వాలనివ్వకుండా దేశరక్షణకు కాపలా కాశానని చెప్పేవాడు. చివరకు జమ్మూకాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఆదివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో దేశం కోసం ప్రాణాలని వదిలేసాడు.
అలాగే , ఉగ్రవాదుల గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన తెలంగాణ వీర సైనికుడు ర్యాడ మహేష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతని సొంత ఊరు వేల్పూరు మండలం కోమన్ పల్లి. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి ర్యాడ గంగమల్లు, తల్లి చిన్నరాజు. మహేష్ సొదరుడు భూమేష్ మస్కట్ లో ఉన్నారు. మహేష్ ప్రాథమిక విద్య కోమన్ పల్లిలో జరగగా, పదో తరగతి వరకు కుకునూరులో చదువుకున్నారు. నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ వరకు చదువుకున్న మహేశ్ ఇంటర్ పూర్తి కాగానే కరీంనగర్ లో మిలటరీ శిక్షణ తీసుకున్నారు. మహేష్ మరణవార్త విని కన్నీరు మున్నీరు అవుతున్న భార్య సుహాసిని మహేశ్ గురించి ప్రతి క్షణం తలుచుకుంటోంది. మహేష్, సుహాసినిలు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. సుహాసిని పుట్టుకతోనే తల్లిని కోల్పోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. సుహాసిని తన బాబాయ్ జీ.టి.నాయుడు వద్దే పెరిగింది.ఆర్మీలో పనిచేస్తున్న జీటీ నాయుడు హైదరాబాద్ బొల్లారంలో నివాసముంటున్నాడు. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మహేష్, సుహాసినిల మధ్య పరిచయం ఏర్పడింది. రెండేళ్ల ప్రేమ తర్వాత కుటుంబసభ్యుల ఆమోదంతో రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ‘మహేశ్ ఉన్న ఈ రెండు నెలలు ఎలా సంతోషంగా గడపాలనే ప్లాన్ చేసుకున్నాం. ఈసారి తనతో పాటు నేనూ వెళతానని ఆనందంగా ఉన్నాను. పది రోజుల్లో మహేష్ పుట్టిన రోజు ఉంది.. పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకుందామని అనుకున్నాము. ఆదివారం అతను ఉగ్రవాదులతో పోరాడాడు. ఆ ముందు రోజే నాతో ఫోన్‌లో మాట్లాడారు. తాను సేఫ్‌గా ఉన్నానని, ధైర్యంగా ఉండమని, జాగ్రత్తగా ఉండమని చెప్పారు, ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని సుహాసిని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది.