బాబూ...పుష్కర మరణాలు నీ అకౌంటే..

Update: 2018-09-19 09:58 GMT
"అతి సర్వత్రా వర్జయేత్" అంటే అర్దం ఏదైనా ఎక్కువైతే అది మేలు కంటే కూడా కీడే ఎక్కువ అని అర్దం............

"అతి సర్వత్రా వర్జయేత్" ఇది మరోసారి రుజువైంది. 2015లో గోదావరి పుష్కారాల సమయంలో తొక్కిసలాటలో దాదాపు 30 మంది దాక మరణించారు. దీనికి అతిప్రచారమే కారణమని జస్టిస్ సోమయాజుల కమిషన్ తన నివేదికలో  పేర్కొంది. ఈ ఘటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని దోషిని చేయడం సరికాదని జస్టిస్ సోమయాజుల కమిషన్ అభిప్రాయ పడింది. 2015లో వచ్చిన పుష్కరాలు 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాపుష్కరాలని బాబు చేసిన  అతి ప్రచారమే ఈ అనర్దానికి దారి తీసిందని కమిషన్ పేర్కొంది. మూహుర్త సమయానికి స్నానానికి సంబంధించి అతిగా ప్రచారం చేసిందని - ఆ ప్రచారాన్ని ప్రజలు గుడ్డిగా నమ్మి ప్రమాదం బారిన పడ్డారని కమీషన్ తెలిపింది. అయితే పుష‌్కరాలను చంద్రబాబు నాయుడు తన ప్రచారానికి వాడుకోవాలని భావించారు. దీంతో ప్రచారం మరింత పెరిగి మూహుర్త సమయానికి లక్షల మంది ఒకే చోలకు చేరుకున్నారు. పైగా వీటిని కొన్ని మీడియా సంస్థల ద్వారా ప్రత్యక్ష్య ప్రచారం కూడా చేయించారు. దీంతో టివీలలో కనిపించాలనే అత్యుత్సాహంతో తొక్కిసలాట జరిగిందని వార్తలు వచ్చాయి. ప్రమాదం జరిగిన ఘాట్ చాలా  చిన్నదిగా ఉందని - ఆ సమయంలో ప్రజలు పవిత్ర  స్నానానికి ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని జస్టిస్ సోమయాజుల కమీషన్ తెలిపింది. తామూ నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ వీడియోలతో సహా అన్ని సాక్ష్యలను పరిశీలించిన మీదటేనే నివేదికను సమర్పించామని చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అత్యుత్సాహం ప్రచార్భాటమూ 30 మందిని పొట్టన పెట్టుకుంది. దీని ఫలితంగా ఆ కుటుంబాల వారు తమ వారిని కోల్పోయారు. దీనికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైన చంద్రబాబు నాయడు పాత్ర ఉందని కమీషన్ నివేదిక ద్వారా అర్దమవుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.  ఆనాటి మరణాలకు చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే కారణమని - ఆయన నియమించిన కమీషన్ ప్రభుత్వానికి అనుకూలంగానే నివేదికలు ఇస్తుందని పలువురు ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News