తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు గుర్తింపు నిచ్చే క్రమంలో పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. శాసనమండలి చైర్మన్ గా మాజీ మంత్రి - సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నిక కానున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత చైర్మన్ చక్రపాణి పదవీకాలం మార్చికి ముగియనున్న నేపథ్యంలో సోమిరెడ్డికి మండలి చైర్మన్ ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఏపీ శాసనమండలికి సంబంధించి ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిసింది. వీటికి మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. ఆ సందర్భంగా సోమిరెడ్డిని చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉన్న సమయంలో, ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యర్థి పార్టీ అయిన వైకాపాపై ఎదురుదాడిలో కీలకపాత్ర పోషించిన సోమిరెడ్డి టీడీపీకి రక్షణకవచంలా నిలిచారు. తాజాగా రాష్ట్రంలో రెడ్డి వర్గాన్ని మెప్పించేందుకు తెదేపా నాయకత్వం తీసుకుంటున్న అనేక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇప్పటికే కర్నూలు - కడప - అనంతపురం - నెల్లూరు జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్లను తెదేపాలో ఆకర్షించింది. రానున్న ఎన్నికల్లోగా రెడ్డివర్గాన్ని జగన్‌కు పూర్తిగా దూరం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న తెదేపా నాయకత్వం, అందులో భాగంగా మండలి చైర్మన్ పదవిని అదే వర్గానికి చెందిన సోమిరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమచారం. సోమిరెడ్డికి చైర్మన్ పదవి ఇస్తే గుంటూరు, ప్రకా శం, చిత్తూరు జిల్లాల్లో రెడ్డి వర్గం తెదేపా వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నిజానికి సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా మండలి చైర్మన్ ఆశిస్తున్నప్పటికీ, కులసమీకరణ కారణంగా ఆయనకు ఆ పదవి దక్కకపోవచ్చు. కాగా మండలిలో మొత్తం 7స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం మొత్తం 7 స్థానాల్లో ఒకటి వైకాపా, మిగిలిన ఆరు సీట్లు తెదేపాకు దక్కనున్నాయి. ఈ క్రమంలో సాంకేతికంగా కాంగ్రెస్ - వైకాపాకు తగినంత సంఖ్యాబలం లేనందున చైర్మన్ పదవి టీడీపీకి దక్కనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/